Begin typing your search above and press return to search.

ఓర్వలేనంతగా లోకేష్ ఏం సాధించాడు

By:  Tupaki Desk   |   18 Oct 2016 11:05 AM IST
ఓర్వలేనంతగా లోకేష్ ఏం సాధించాడు
X
‘‘తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను వెలగబెడుతున్న నారా లోకేష్ అసమర్థతల్ని ప్రస్తావించినప్పుడెల్లా.. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక వైకాపా నాయకులు నోరు పారేసుకుంటున్నారని లోకేష్ తైనాతీ మంత్రులంతా ఎదురు దాడులకు సిద్ధ పడతారు. లోకేష్ ఎదుగుదలను చూసి వైకాపా నాయకులు - జగన్మోహనరెడ్డి అసూయ పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తారు. అయితే నిజానికి ఎవరైనా సరే.. చూసి ఓర్వలేకపోయేంతగా.. లోకేష్ తన జీవితంలో ఇప్పటిదాకా సాధించిన విజయం ఏముంది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ ఛార్జి ఐవి రెడ్డి అన్నారు.

వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ ప్రస్థానానికి - తండ్రిని అడ్డు పెట్టుకుని లోకేష్ సాగిస్తున్న రాజకీయ రౌడీయిజానికి పోలికే లేదని ఐవిరెడ్డి విమర్శించారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క రోజైనా సెక్రటేరియేట్ లో అడుగు కూడా పెట్టకుండా - ఒక్క ఐఏఎస్ తోగానీ - మంత్రితోగానీ మాట్లాడకుండా తన పని తాను చూసుకున్న జగన్మోహనరెడ్డి మీద అభిమానంతో.. వైఎస్సార్ మరణానంతరం అందరూ కలిసి ఆయనను తమ నాయకుడిగా ఎంచుకున్నారని, అదే లోకేష్ విషయానికి వస్తే.. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా.. మంత్రులకు ఆదేశాలు తాను ఇస్తూ రాజకీయ దందాలు చేస్తూ సచివాలయాన్ని.. సీఎం క్యాంప్ ఆఫీసును తన దందాలకు అడ్డాగా - మాఫియా డెన్ లాగా మార్చేశాడని ఐవి రెడ్డి ఆరోపించారు.

లోకేష్‌ను చూసి ఇతరులు ఓర్వలేకపోతున్నారని అనుకోవడం తెలుగుదేశం నాయకుల్లోని అమాయకత్వానికి, అవివేకానికి నిదర్శనం అని ఐవి రెడ్డి పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/