Begin typing your search above and press return to search.

ఆ నేత ఇంట్లో 90 కోట్లు 100 కిలోల బంగారం!

By:  Tupaki Desk   |   8 Dec 2016 9:47 PM IST
ఆ నేత  ఇంట్లో 90 కోట్లు 100 కిలోల బంగారం!
X
జయలలిత మరణంతో విషాదంలో ఉన్న చెన్నైలో మరో సంచలనం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు సంచలనం రేపాయి. ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి ఇళ్లలో 60 మంది ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు ఏకంగా 100 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం కాకుండా 70 కోట్లు నగదు అందులో 10 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్టు సమాచారం

ఆ వ్యాపారవేత్తలకు చెందిన వేలూరు, కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేసి ముగ్గురినీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ 130 కోట్ల రూపాయలుగా తేల్చారు. కడ్డీల రూపంలో బయటపడిన బంగారం నిల్వలు చూసి అధికారులకే మతిపోయిందట.

టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్‌ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్ రెడ్డి ఒకరు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపట్టినట్టు తెలుస్తోంది.