Begin typing your search above and press return to search.

గల్ఫ్ వెళ్లాలనుకునేవారికి ఇక కష్టమే ... ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:20 PM IST
గల్ఫ్ వెళ్లాలనుకునేవారికి ఇక కష్టమే ... ఏమైందంటే ?
X
ప్రపంచంలోని నలుమూలల నుండి గల్ఫ్ దేశాలకి పనుల కోసం వలస వెళ్తుంటారు. ముఖ్యంగా మనదేశం నుండి కూడా చాలామంది పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పడుతుంటారు. అయితే , ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో జీతాలు మంచిగా ఉండేవి ,కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా మారిపోయింది. కానీ, ఇక్కడ కంటే గల్ఫ్ కంట్రీస్ కి ఉపాధి కోసం వెళ్తే , మంచి సంపాదన ఉంటుంది అనుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఏడాది కూడా గల్ఫ్ కంట్రీస్ కి వలస వచ్చే కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇళ్లల్లో పనుల నుండి అనేక రకాల పనుల కోసం , వర్క్ పర్మిట్ వీసా తో లక్షలు అప్పు చేసి వెళ్తుంటారు. అలా వెళ్లిన వారిలో కొందరు, అక్కడి పరిస్థితులకి అలవాటు పడలేక వెనక్కి వచ్చేస్తుంటారు. అయితే , గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తే మంచి సంపాదన ఉంటుంది అనేది మాత్రం అందరిలో నాటుకుపోయింది.

అయితే , గల్ఫ్ కి వెళ్లాలనుకునేవారు వర్క్ పర్మిట్ వీసా కోసం లక్షల్లో డబ్బు కడుతుంటారు. అలాంటి వారికి తాజాగా ఒమన్ లేబర్ మినిస్ట్రీ మరో షాక్ ఇచ్చింది. ప్రవాస కార్మికులకు సంబంధించిన వర్క్ వీసా ఫీజును ఐదు శాతం పెంచినట్లు ప్రకటించింది. ఒమనీయేతర శ్రామికశక్తికి జారీ చేసే, రెన్యూవల్ చేసే ఎంప్లాయిమెంట్ వీసా ఫీజు ఐదు శాతం పెంచబడిందని , అలాగే వారి వద్ద నుండి అదనంగా వసూలు చేసే ఈ ఐదు శాతం ఫీజును జాబ్ సెక్యూరిటీకి ఉపయోగించబోతున్నాం అని తెలిపింది. అంటే ఇకపై వర్క్ ఫీజు గతంలో చెల్లించిన దానికంటే , ఐదు శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఇకపోతే , ఇక వివిధ కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడిన ఒమానీ పౌరులకు తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించడమే జేఎస్ ఎస్ లక్ష్యం. ఉద్యోగ భద్రతా వ్యవస్థ నిబంధనల ప్రకారం ఎవరైనా యజమాని ఒమానీని ఉద్యోగం నుంచి తొలగించే మూడు నెలల ముందు కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి, ఉద్యోగార్థులకు జేఎస్ ఎస్ నిధుల నుంచి తాత్కాలిక ఆర్థిక సహాయం చేస్తారు. దానికోసం ఒమన్ కార్మిక శాఖ తాజాగా పెంచిన ఐదు శాతం ఫీజును ఉపయోగించబోతున్నారు.