Begin typing your search above and press return to search.

'ఐటీడీపీ' ఇంకొక ఎంపీ వీడియో రిలీజ్ చేయ‌బోతోందా?

By:  Tupaki Desk   |   8 Aug 2022 3:54 AM GMT
ఐటీడీపీ ఇంకొక ఎంపీ వీడియో రిలీజ్ చేయ‌బోతోందా?
X
తాజాగా వైసీపీ హిందూపురం ఎంపీ.. మాజీ పోలీసు.. గోరంట్ల మాధ‌వ్‌కు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్.. రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింద‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ఎక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది? ఎలా వ‌చ్చింది? అనేది మాత్రం ఆస‌క్తిగా మారింది. అయితే.. వైసీపీ వ‌ర్గాలు కానీ.. రాజ‌కీయ వ‌ర్గాలు కానీ.. కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చెబుతున్న‌ది ఏంటంటే.. ఈ వీడియోను ఐటీడీపీ విడుద‌ల చేసింద‌నే!

ఐటీడీపీ అనేది.. తెలుగు దేశం పార్టీకి అత్యంత కీల‌క‌మైన సోష‌ల్ మీడియా విభాగం. రాష్ట్రంలో, దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. ముఖ్యంగా వైసీపీ నేత‌ల క‌ద‌లిక‌లు.. వారి వ్య‌వ‌హారాల‌ను.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు.. జీవోల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు.. ప‌రిశీలిస్తూ.. వాటిని టీడీపీకి అనుకూలం గా లేదా.. వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డంలో ముందున్న విభాగం. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీపీ విభాగం ప‌నితీరు జోరుగా ఉంది.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ఒక వింగ్‌ను ఏర్పాటు చేసి.. నెల‌కు 30 వేల రూపాయ‌ల‌కు పైగానే.. వేతనాలు ఇస్తూ.. ఉద్యోగుల‌ను నియ‌మిస్తూ.. ఈ వింగ్‌ను తెలుగు దేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోందని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్న ప్ర‌చారం. ఈ క్ర‌మంలోనే గ‌తంలో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన త‌ర్వాత‌.. 'హూ కిల్డ్ బాబాయ్‌?!' అనే టైటిల్‌తో వైసీపీ స‌ర్కారుపై .. టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. అయితే. ఇప్పుడు.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ మ‌రో ప‌ని ప్రారంభించింది.

ఇటీవ‌ల అన్న‌గారు ఎన్టీఆర్ చిన్న‌కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ నాయకులు.. ముఖ్యంగా.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వంటివారు.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చేసుకున్నారు. 'హూ కిల్డ్ పిన్ని' పేరుతో టీడీపీ పై విరుచుకుప‌డ్డారు. ఈ వివాదం కొన‌సాగుతున్న క్ర‌మంలోనే.. అనూహ్యంగా గోరంట్ల మాధ‌వ్ విష‌యం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాధ‌వ్‌కు సంబంధించిన న్యూడ్ వీడియో.. ఐటీడీపీ విభాగం నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నే చ‌ర్చ సాగుతోంది.

ఈ వీడియో క్ష‌ణాల్లోనే ల‌క్ష‌ల మందికి రీచ్ అయిపోయింది. అయితే.. దీనిని మొద‌ట్లో.. ఐటీడీపీ విభాగ‌మే విడుద‌ల చేసింద‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. వైసీపీలో ఉన్న పాత‌, కొత్త ప‌రిచ‌యాలు.. సంబం ధాల‌ను అడ్డు పెట్టుకుని.. ఐ టీడీపీ ట్రాప్ చేసింద‌ని.. చెబుతున్నారు. దానిలో భాగంగానే.. ఎంపీ గోరంట్ల కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని.. టీడీపీ డిజిట‌ల్ విభాగమే దీనిని ట్రాప్ చేసింద‌ని అంటున్నారు. దీంతో మాధ‌వ్ వారికి అడ్డంగా దొరికి పోయారనే వాద‌న వినిపిస్తోంది.

ట్యాగ్ చేసింది.. వైర‌ల్ చేసింది.. ఫేస్‌బుక్‌లో పెయిడ్ ప్రెమోష‌న్ చేసింది కూడా టీడీపీ నేన‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌, ఇంత జ‌రుగుతున్నా.. జ‌గ‌న్ స‌ర్కారు మౌనంగా ఉందేంటి? అనే ప్ర‌శ్న‌లు తెమీదికి వ‌చ్చాయి. కానీ.. జ‌రిగిన ప‌రిణామాలు.. ఇత‌ర‌త్రా మొత్తం ప‌రిశీలించిన‌ ప్ర‌భుత్వం ఈ వీడియో ఇంకా పెద్దదేమో.. ఎంత వ‌స్తుందో.. అని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఐ టీడీపీ వాళ్ల‌ను అరెస్టు చేయ‌డంలేద‌ని.. చివ‌ర‌కు విచార‌ణ‌కు కూడా పిల‌వ‌డం లేద‌ని. అంటున్నారు.

ఒక‌ వేళ వాళ్ల‌ను అరెస్టు చేస్తే.. వాళ్లు మొత్తం చెప్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. అంటున్నారు. అయితే.. ఐ టీడీపీ వాళ్ల ద‌గ్గ‌ర‌.. ఇంకో ఎంపీ వీడియో కూడా ఉంద‌ని.. దానిని కూడా లీక్ చేస్తుంద‌ని.. మీడియాలో ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి మాత్రం భిన్న‌మైన వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌ద‌రు వీడియోను లీక్ చేయాల‌ని.. ఐ టీడీపీ భావిస్తున్న‌ట్టు అందులోని టీమ్ చ‌ర్చించుకుంటున్నట్టు తెలిసింది.