Begin typing your search above and press return to search.

కిడ్నీ పేషెంట్​ కోసం రోమ్​ పోలీసుల భారీ సాహసం.. 2 గంటల్లో 500 కి.మీ ప్రయాణం

By:  Tupaki Desk   |   10 Nov 2020 1:40 PM IST
కిడ్నీ పేషెంట్​ కోసం రోమ్​ పోలీసుల భారీ సాహసం.. 2 గంటల్లో 500 కి.మీ ప్రయాణం
X
ఓ కిడ్నీ పేషెంట్​ ప్రాణాలు కాపాడేందుకు ఇటలీ పోలీసులు భారీ సాహసం చేశారు. ఓ వ్యక్తికి అత్యవసరంగా కిడ్నీని మార్చాల్సి రావడంతో 500 కిలోమీటర్లను కేవలం 2 గంటల్లో ప్రయాణించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. సమయానికి కిడ్నీ చేర్చారు. పోలీసుల సాహసంపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ కారును అంత స్పీడ్ గా నడిపిన వ్యక్తికి హ్యాట్సాప్ చెబుతున్నారు. రోమ్​లోని జెమెల్లీకి చెందిన ఓ వ్యక్తికి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి అత్యవసరంగా కిడ్నీని మార్చాల్సి వచ్చింది. రోమ్​లోని జెమెల్లీ ఆస్పత్రి నుంచి పేషంట్ ఉన్న పడొవ నగరానికి దాదాపు 500 కిలోమీటర్లు దూరంగా ఉంది. దీంతో పోలీసులు లంబోర్గనీ హురకాన్​ కారును ఉపయోగించి గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నారు. చివరకు జెమెల్లీ ఆస్పత్రికి కిడ్నీని చేర్చి ప్రాణాలు కాపాడారు.

అయితే పోలీసుల సాహసాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్​మీడియాతో వైరల్​గా మారాయి. ఓ రోగి ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా సాహసం చేయడంతో పలువురు వారిని ప్రశంసిస్తున్నారు. నిజానికి 500 కిలోమీటర్ల గమ్యాన్ని కేవలం రెండు గంటల్లో తీసుకోవడం గొప్ప సాహసంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణం ఎంతో సాహసోపేతమైనదే కాక.. ప్రమాదకరం కూడా.. ఒక వేళ తేడావస్తే రోగితో పాటు పోలీసుల ప్రాణాలకే ముప్పు. అయితే ఎంతో ఖరీదైన లంబోర్గనీ హురకాన్​ కారును పోలీసులు ఇందుకోసం ఉపయోగించారు. టార్గెట్ సమయంలో గమ్యాన్ని చేరుకుని ఓ ప్రాణం కాపాడారు.