Begin typing your search above and press return to search.
ఫోటోలు చూసి సినిమా షూటింగ్ అనుకుంటే తప్పే
By: Tupaki Desk | 13 Dec 2020 9:00 AM ISTభయానకమైన రోడ్డు ప్రమాదం తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం సీన్లు చూస్తే..దారుణంగా ఉన్నాయి. ఇక.. దూరం నుంచి చూస్తే.. అదేదో సినిమాకు సంబంధించిన భారీ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారనుకోక మానదు. ఎందుకంటే.. అంతలా వాహనాలు చెల్లాచెదురు కావటమే కారణం. ధర్మపురి - సేలం మార్గంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.
సిమెంట్ లోడుతో వెళుతున్న భారీ లారీ ఒకటి అదుపు తప్పింది. వేగంగా దూసుకెళుతున్న ఈ భారీ లారీ అదుపు తప్పి.. ఇతర వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ఉదంతంలో ఆరుగురు ఘటనాస్థలంలోనే మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.దాదాపు 15 వరకు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని కార్లు అయితే.. గుర్తు పట్టలేనంత దారుణంగా దెబ్బ తిన్నాయి. దీంతో.. ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
ప్రమాద దృశ్యాల్నిచూసినంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. భయానకంగా ఉన్నాయి. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి అవాక్కు అయిన పరిస్థితి.