Begin typing your search above and press return to search.

మోడీ అడిగిన ఇన్నాళ్లకు భారత్ కు వచ్చేందుకు ఓకే చెప్పిన ఆ దేశ ప్రధాని

By:  Tupaki Desk   |   16 Dec 2020 9:13 AM IST
మోడీ అడిగిన ఇన్నాళ్లకు భారత్ కు వచ్చేందుకు ఓకే చెప్పిన ఆ దేశ ప్రధాని
X
భారతదేశ పర్యటకు రావాలని.. జనవరి 26న నిర్వహించే భారత గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిధిగా రావాలంటూ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను కొద్ది రోజుల క్రితమే దేశ ప్రధాని మోడీ ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. రోజులు గడుస్తున్నా.. బ్రిటన్ ప్రధాని నుంచి ఓకే మాట రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా గణతంత్ర వేడుకలకు తాను వస్తున్నట్లుగా బోరిస్ జాన్సన్ వెల్లడించారు.,

దీంతో.. వచ్చే ఏడాది జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకులకు బోరిస్ జాన్సన్ ముఖ్య అతిధిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రటనను డౌన్ స్ట్రీట్ ప్రకటించింది. బ్రెగ్జిట్ తర్వాత పాలనా పగ్గాల్ని చేపట్టిన బోరిస్.. తాను ప్రధాన మంత్రి హోదాలో చేపడుతున్న అతి పెద్ద ద్వైపాక్షిక పర్యటన ఇదేనని చెబుతున్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన కూడా ఇదేనని చెబుతున్నారు.

ఈ పర్యటనతో కొత్త సంవత్సరాన్నిగొప్పగా ఆరంభించబోతున్నట్లుగా జాన్సన్ పేర్కొన్నారు. తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఎత్తులకు వెళుతుందని ఆశిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా మోడీకి ఆహ్వానాన్ని అందించారుజాన్సన్. వచ్చే ఏడాది బ్రిటన్ లో జరిగే జీ-7 దేశాల సదస్సుకు ప్రధాని మోడీని హాజరు కావాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక కీలక దేశంగా మారిందని బోరిస్ పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. మోడీ ఆహ్వానానికి స్పందన కాస్త ఆలస్యంగా వచ్చిందన్న మాట వినిపిస్తోంది.