Begin typing your search above and press return to search.

ఐటీ పరిశోధన బెంగళూర్ ను దాటిన హైదరాబాద్

By:  Tupaki Desk   |   3 Oct 2019 2:35 PM IST
ఐటీ పరిశోధన బెంగళూర్ ను దాటిన హైదరాబాద్
X
ఐటీ పరిశోధనలకు అంతర్జాతీయ హబ్ గా హైదరాబాద్ మారుతోంది. ఐటీ సిటీ బెంగళూరును కాదని హైదరాబాద్ కు అంతర్జాతీయ ప్రముఖ ఐటీ సంస్థలు పరిశోధనల కోసం ఎంచుకోవడం వెనుక కారణమేంటి? ఎందుకు హైదరాబాద్ నే పరిశోధనలకు సరైన స్థానంగా ఎందుకుంటున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనికి కారణంగా బెంగళూరుతో పోలిస్తే హైదరాాబాద్ లో చవకైన మానవ వనరులు, మౌళిక సదుపాయాలతోపాటు వలసల రేటు బెంగళూరుతో పోల్చితే చాలా తక్కువగా ఉండడమే కారణంగా ఐటీ మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి..

ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్, పెప్సికో, జేడీ స్పోర్ట్స్ లు ఇప్పటికే హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్ హౌస్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇక చాలా బహుళ జాతి కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు (ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక తమ సొంత అవసరాల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు (జీఐసీ)లను కూడా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కు పోటెత్తుతున్నాయి. దీని కారణం హైదరాబాద్ లో వ్యయం తక్కువ కావడమేనట..

బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో మౌళిక సదుపాయాల వ్యయం తక్కువ. ఇక బెంగళూరుతో పోల్చితే తక్కువ వ్యయానికే హైదరాబాద్ లో నిపుణులు దొరుకుతున్నారు..ఇక ఐటీలో ప్రధాన సమస్య వలసలు.. మంచి నిపుణులైన ఉద్యోగులను బెంగళూరులో కంపెనీలు లాగేసుకొని ఇతరులకు నష్టం చేకూరుస్తాయి. బెంగళూరులో వలసల రేటు 12-13 శాతం ఉంటే.. హైదరాబాద్ లో అది కేవలం 3-4శాతం మాత్రమే.

ఇక అన్నింటికంటే హైదరాబాద్ లో విభిన్న మతాలు, ఉత్తరాది వారితో భిన్న సంస్కృతి, ఆహ్లాదకర వాతావరణం కూడా హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు పరిశోధనలకు కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.