Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూస్తే.. కర్ణాటక 'హిజాబ్' హీట్ ఇట్టే అర్థమవుతుంది

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:47 AM GMT
ఈ వీడియో చూస్తే.. కర్ణాటక హిజాబ్ హీట్ ఇట్టే అర్థమవుతుంది
X
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ రగడ భారీగా సాగుతోంది. దీనికి సంబంధించిన వార్తలకు ఇప్పుడు ఆ రాష్ట్ర మీడియానే కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆసక్తిగా చూస్తున్నారు. ‘హిజాబ్’ హీట్ కు సంబంధించిన అన్ని కోణాలపై ఫోకస్ పెడుతున్నారు. దీనికి కారణం ఈ రోజున కర్ణాటకలో వెలుగు చూసిన వైనం..రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు పాకటం ఖాయమంటున్నారు.

ఇప్పుడున్న వివాదాన్ని సింఫుల్ గా చెప్పేస్తే.. హిజాబ్ (ముసుగు) వేసుకోవటం తమ హక్కుగా ముస్లిం విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిందూ మతానికి చెందిన విద్యార్థినులు.. కాషాయ కండువాతో కళాశాలలకు హాజరవుతామని వాదిస్తున్నారు. ఈ వాదనల్ని విన్నంతనే విచిత్రంగా ఉన్నప్పటికీ.. సదరు కాలేజీ అమ్మాయిలు వినిపిస్తున్న వాదన వింటే.. కొత్త ఆలోచనలు వచ్చే పరిస్థితి.

1983 కర్ణాటక సర్కారు విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులంతా ఒకేలాంటి దుస్తుల్ని ధరించాలని.. సెక్షన్ 132(2) ప్రకారం రూల్ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా ఉంటే.. ప్రైవేటులో మాత్రం తమకు నచ్చిన రంగు యూనిఫాంను ధరించే వీలుందని చెబుతున్నారు. తాజాగా ముస్లిం విద్యార్థుల హిజాబ్ ను ధరించాలని డిమాండ్ చేస్తుంటే.. అందుకు భిన్నంగా హిందూ మతానికి చెందిన కాలేజీ అమ్మాయిలు.. మెడలో కాషాయ కండువాను వేసుకొని కాలేజీకి వెళుతున్నారు.

అదేమంటే.. అందరికి ఒకే రూల్ ఉంటుంది కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ముస్లిం విద్యార్థినులకు హిజాబ్ వేసుకోవటానికి అనుతి ఇస్తే ఇవ్వండి కానీ మాకు కూడా కాషాయ కండువా మెడలోవేసుకోవటంలో తప్పేముంది?అని ప్రశ్నిస్తున్నారు. అందరిని సమానంగా చూస్తున్నామన్న మాటల్ని చెప్పే వేళలో.. చట్టబద్ధంగా చేసిన చట్టం ప్రకారం కాకుండా.. అందుకు భిన్నంగా మినహాయింపులు ఎలా ఇస్తారు? అని హిందూ విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. మరేం జరుగుతుందో కాలమ్ డిసైడ్ చేయాల్సిందే.

పాలకులు కొందరి విషయంలో ఒకలా.. మరికొందరి విషయంలో ఇంకోలా వ్యవహరించటమే తాజా సమస్యలన్నింటికి కారణమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరహా ఇష్యూ తెర మీదకు వచ్చిన వేళ.. దీన్ని ఏ రకంగా క్లోజ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కొత్త తరహా వాదన దేశ వ్యాప్తంగా మరికొన్ని రాష్ట్రాలకు పాకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.