Begin typing your search above and press return to search.

ఐటీ జాబ్స్ గోవిందా.. టెక్ ఉద్యోగుల తొలగింపులు.. భారతీయుల పరిస్థితి అంతేనా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:11 AM GMT
ఐటీ జాబ్స్ గోవిందా.. టెక్ ఉద్యోగుల తొలగింపులు.. భారతీయుల పరిస్థితి అంతేనా?
X
కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగ భద్రతపై ఇప్పటికీ ఆందోళనకరంగానే మారుతోంది. కరోనా పీడ దాదాపు ప్రభావం చూపకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులు పలు కంపెనీలను కోలుకోకుండా చేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఆపిల్ తదితర కంపెనీల్లో లాభాల శాతం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించడమే పరిష్కార మార్గం అని అనుకుంటున్నాయి. ఐటీ దిగ్గజాల్లో ఈ పరిస్థిత ఉండడంతో వాటికి అనుబంధంగా ఉన్న భారత్ కంపెనీల్లో దడ పుట్టిస్తోంది. పలు కంపెనీలో మూన్ లైటింగ్ విషయంలో సీరియస్ గా ఉండడంతో ఆందోళన వాతావరణం ఏర్పడతోంది.

ప్రపంచంలోని ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఆపిల్, టెస్లా, మెటా వంటి సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. గత రెండు సంవత్సరాల నుంచి ఈ సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫెబెట్ ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 16 బిలయన్లకు దగ్గరగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో లాభం 18.5 బిలియన్లు సాధించింది. మైక్రోసాఫ్ట్ అంచనాలు కూడా బాగా తగ్గాయి. 51.9 బిలియన్ డాలరల్ ఆదాయన్నొ పొందినట్లు ప్రకటించింది. ఫేస్ బుక్ లాభం సైతం 36 శాతం తగ్గి 6.7 బిలియన్లకు చేరుకుంది.

ఇదిలా ఉండా వరల్డ్ వైడ్ గా ఏర్పడిన క్రైసీస్ ను తట్టుకునేందుకు ఫెడరల్ బ్యాంక్ పోరాడుతోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు. ఇందులో భాగంగా ద్రవ్యోల్భణాన్ని నియంత్రించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం మిగతా దేశాల్లోని బ్యాంకులపై పడింది. దీంతో రుణాలు తీసుకోవడంతో కొన్ని కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. సాధారణంగా కంపెనీల చేతిలో వందల కోట్ల నగదు ఉన్నా వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో చాలా కంపెనీలు విస్తరణకు చొరవ చూపడం లేదు. ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో వారి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నాయి.

ఈ పరిస్థితి ఇప్పటికే చాలా కంపెనీల్లో ప్రారంభమైంది. ఆ ఫలితం ఉద్యోగులపై పడుతోంది. వచ్చే త్రైమాసికంలోనూ ఇలాంటి ఫలితాలు వస్తే ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఉద్యోగులను తొలగించడమే పరిష్కార మార్గం అనుకుంటాయి. అటు కొత్త ఉద్యోగలును నియమించడానికి బాధ్యత వహించే సుమారు 100 మంది కాంట్రాక్టు ఆధారిత రిక్రూటర్లను ఆపిల్ సంస్థ తొలగించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ట్విట్టర్ దాని నియామక ప్రక్రియను గణనీయంగా తగ్గించింది.

మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇదే ఫాలో అవుతోంది. ఇప్పటికే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో 200 మంది ఉద్యోగులను తొలగించింది. టెస్లా సైతం 200 మందికి ఉద్వాసన పలికింది. త్వలరో ఆటో పైలట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించింది. ఇలా ఏ కంపెనీ చూసిన ఉద్యోలను తొలగించడంతోనే మాంద్యం నుంచి గట్టెక్కవచ్చని ఆలోచిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఓ వైపు కంపెనీలో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతుండగా.. మరికొన్ని కంపెనీలకు ఐటీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీల్లో కార్మికులకొరత 16 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని మ్యాన్ పవర్ గ్రూప్ అధ్యయనం వెల్లడించిది. అయితే ఇది భారతీయ ఐటీ ఐద్యోగులకు వరం అని కొందరు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.