Begin typing your search above and press return to search.
రాష్ట్రానికి తీవ్ర కష్టం.. వ్యాక్సిన్ కు పైసలేవీ?
By: Tupaki Desk | 23 April 2021 2:00 PM ISTఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఖజానా పరిస్థితి ఇబ్బందికరంగా తయారైనా.. ప్రజలకు సంక్షేమం విషయంలో లోటు లేకుండా చూస్తోంది ప్రభుత్వం. నవరత్నాలు వంటి ప్రతిష్టాత్మక పథకంతోపాటు ఎన్నో పథకాలను ప్రజల ముందుకు తెచ్చింది. మరోవైపు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు అడ్జెస్ట్ చేస్తోంది. గత ప్రభుత్వం కన్నా.. ఎక్కువ సంక్షేమాన్ని అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.
ఖజానాపై భారం పడుతున్నా.. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో పథకాలను అమలు చేస్తోంది. అయితే.. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ భారం రాష్ట్రాలపైనే వదిలేసి చేతులు దులుపుకుంది కేంద్రం. అంతేకాదు.. కేంద్రం 150 రూపాయలకు కొనుగోలు చేస్తున్న టీకాను.. రాష్ట్రాలు 400 రూపాయలు చెల్లించాలని చెప్పింది. దీంతో.. ఏపీ తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తోంది.
ఇప్పటి వరకూ 45 సంవత్సరాలకు పైబడిన వారికి టీకాలు అందించారు. మే నెల ప్రారంభం నుంచి 18 సంవత్సరాలకు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారి సంఖ్య దాదాపు మూడున్నర కోట్లు ఉన్నట్టు అంచనా. అంటే.. రెండు డోసులు కలిపి 7 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం ఉంటుంది.
అయితే.. రాష్ట్రం వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుందా? డబ్బులు పెట్టి ప్రజలను కొనుక్కోమని చెబుతుందా? అన్నది కీలకం. కేంద్రం తమకు సంబంధం లేదని ప్రజలను గాలికి వదిలేసింది. మరి, రాష్ట్రం ఆ పని చేయగలదా? అన్నది సందేహం. తన ప్రజలను తానే రక్షించుకోవాలని రాష్ట్రం సంకల్పిస్తే మాత్రం ఆర్థిక భారం మోయడానికి సిద్ధంగా ఉండాలి.
ఇందుకోసం కనీసం రూ.3 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. మరి, ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుందన్నదే సమస్య. దీనిపై జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.