Begin typing your search above and press return to search.

చ‌దువు పూర్త‌య్యాక ఉంటామంటే కుద‌ర‌దు... అమెరికా కీల‌క బిల్లు!

By:  Tupaki Desk   |   31 July 2021 5:00 AM IST
చ‌దువు పూర్త‌య్యాక ఉంటామంటే కుద‌ర‌దు... అమెరికా కీల‌క బిల్లు!
X
ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లారు. చ‌దువు పూర్త‌యింది. ఇక‌, ఆ త‌ర్వాత ఏదో ఉద్యోగం రాక‌పోతుందా? అనే ధోర‌ణితో అక్క‌డే ఉండే విదేశీ విద్యార్థుల సంఖ్య ఇటీవ‌ల కాలంలో పెరిగింది. అయితే.. ఇక‌పై ఇలాం టి వారికి చెక్ పెట్టేందుకు అమెరికా ప్ర‌బుత్వం సిద్ధ‌మ‌వుతోంది. దీనికి సంబంధించి ప్ర‌తినిధుల స‌భలోని చ‌ట్ట‌స‌భ స‌భ్యుల బృందం ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టింది. దీని ప్ర‌కారం.. విదేశీ విద్యార్థుల‌ను చ‌దువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం వేచి చూసే అవ‌కాశం ఇవ్వ‌రు.

ఈ బిల్లు క‌నుక పాసైతే.. వేల మంది భార‌తీయ విద్యార్థుల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌తినిదుల స‌భ‌లోని కాంగ్రెస్ స‌భ్యులు పాల్ ఏ గోసార్‌, మో బ్రూక్స్‌, ఆండీ బిగ్గ్స్, మ‌ట్ గీట్జ్ త‌దిత‌రులు ఈ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. హై స్కిల్డ్ యాక్ట్ కింద‌.. ప్ర‌వేశ పెట్టిన ఈ బిల్లు ప్ర‌కారం.. ఇమ్మిగ్రేష‌న్‌, నేష‌న‌షనాలిటీ యాక్ట్‌లోని ఆప్ష‌న‌ల్ ప్రాక్టీస్ ట్రైనింగ్‌ను స‌వ‌రించ‌నున్నారు.

ఈ సద‌ర్బంగా కాంగ్రెస్ స‌భ్యుడు గోసార్ మాట్లాడుతూ.. ఈ బిల్లును చ‌రిత్రాత్మ‌క‌మైందిగా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టంపై ఆయ‌న విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఈ చ‌ట్టం ద్వారా త‌క్కువ వేత‌నాల‌తో విదేశీయుల‌ను ఏర్పాటుచేసుకుని స్థానిక అమెరికా పౌరుల హ‌క్కుల‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని.. ఆయ‌న వివ‌రించారు. ఇప్పుడు తెచ్చిన బిల్లు ద్వారా స్థానిక పౌరుల‌కే.. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ఉన్న ఓపీటీ(ఆప్ష‌న‌ల్ ప్రాక్టీస్ ట్రైనింగ్)ను స‌వ‌రించేందుకు గ‌తంలోనూ అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైస్కిల్డ్ అమెరిక‌న్స్ యాక్ట్ ను 116వ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అయితే.. అమెరికా కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా దీనిని రెండు సార్లు స‌వరించారు. అయితే.. ఓపీటీ వ్య‌వ‌స్థ‌పై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విదేశీ విద్యార్థులు త‌మ అవ‌కాశాల‌ను దోచుకుంటున్నార‌నే వాద‌న అమెరికాలో ఉంది. ఈ క్ర‌మంలోనే దీనికి స‌వ‌ర‌ణ తీసుకురాన్నారు.

చ‌ట్ట‌స‌భ‌లో ఆమోదం పొందిన త‌ర్వాత ఈ బిల్లును దేశాధ్య‌క్షుడికి పంప‌నున్నారు. అయితే..ఈ బిల్లు ఏమ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది ప్ర‌శ్న‌గానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు దీనికి కార‌ణం.. చ‌ట్ట‌స‌భ‌ల్లో..విప‌క్ష‌ డెమొక్రాట్లు ఎక్కువ‌గా ఉంది. ఇది ఆమోదం పొందితే త‌ప్ప‌.. అధ్య‌క్షుడికి చేరే అవ‌కాశం ఆయ‌న ఆమోద ముద్ర వేసే అవ‌కాశం ఉండ‌దు.

ఇక‌, అమెరికాలో ఇప్పుడు 80 వేల మంది భార‌తీయ విద్యార్థులు ఓపీటీపై ఉండ‌డం గ‌మ‌నార్హం. ఓపీటీ కార‌ణంగా.. ల‌క్ష మందికి పైగా విద్యార్థులు.. మూడేళ్లుగా అమెరికాలోనే తిష్ట‌వేశార‌ని.. గోసార్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. వీరంద‌రికీ.. ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వ‌డం వ‌ల్ల ఖజానాకు న‌ష్టం చేకూరుతోంద‌ని అన్నారు. ``కాలేజీ చ‌దువులు ముగిసిన త‌ర్వాత‌.. ఉద్యోగాల‌పేరిట ఇక్క‌డే తిష్ట‌వేయ‌డం చాలా ఇబ్బందిక‌రంగా ఉంటోంది. ఈ క్ర‌మంలో ఓపీటీని ఖ‌చ్చితంగా తొలిగించాల్సిన అవ‌స‌రం ఉంది`` అని అమెరికా టెక్ వ‌ర్కర్స్ ఫౌండ‌ర్ కెవిన్ లీన్ అన్నారు.