Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తీసుకోకుంటే మూడో వేవ్ లో కష్టమే..!

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 AM GMT
వ్యాక్సిన్ తీసుకోకుంటే మూడో వేవ్ లో కష్టమే..!
X
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మరో వైపు వైరస్ కొత్త వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉండడం తో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. మరో వైపు వ్యాక్సిన్ తీసుకున్న కానీ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కొంత మంది టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇది మరింత ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు. వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. ఇందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు.

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ పూర్తిగా నశించిపోయినా కానీ వాస్తవానికి మనకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి అనేది చేకూరుతుంది. దీంతో మనుషులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండడం కారణంగా వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో చూస్తే ఎక్కువ కేసులు నమోదు అయినా కానీ టీకా తీసుకున్న వారిలో మాత్రం ఆసుపత్రికి వెళ్లిన వారు చాలా తక్కువగా ఉన్నట్లు గణాంకాలు కూడా చెప్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వైరస్ మూడో వేవ్ ప్రారంభం అయ్యింది.

కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైరస్ ను ఎదుర్కొనేందుకు కచ్చితంగా అందరూ టీకాను తీసుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టీకా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన వారు మాత్రం మూడో వేవ్ లో కచ్చితంగా ఇబ్బంది పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు కేసుల సంఖ్య ఎక్కువ అయిన వ్యాధి తీవ్రత గతంతో పోల్చితే చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.

టీకా తీసుకున్న వారు గతంలో మాదిరిగా ఆక్సిజన్ బెడ్ పైకి ఎక్కడం లేదని గణాంకాలు చెప్తున్నట్లు చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఈ రోజు సుమారు 1.80 లక్షల మందికి వైరస్ సోకింది. 146 మంది వైరస్ కారణంగా చనిపోయారు. 46 వేల మంది వైరస్ నుంచి కోలుకుంటున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. 13.29 శాతానికి చేరినట్టు అధికారులు తెలిపారు.