Begin typing your search above and press return to search.
వారి దెబ్బతో ట్రంప్ కు దారులు మూసుకుపోయినట్లే..!!
By: Tupaki Desk | 28 Nov 2020 5:20 PM ISTనిలువెత్తు మొండితనం.. అంతకు మించిన మూర్ఖత్వం వెరసి అమెరికా అధ్యక్ష పదవి చేతిలో ఉండే కీలక నేత తీరు ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు డొనాల్డ్ ట్రంప్. తన పదవీ కాలంలో తానేం అనుకుంటే దాన్ని చేసిన తీరుతో విసిగిపోయిన అమెరికన్లు..ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన్ను దించేందుకు వీలుగా తీర్పు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చోటు చేసుకుందంటూ తొండాట మొదలెట్టిన ట్రంప్.. అధికార బదిలీకి ససేమిరా అనటం తెలిసిందే.
అవసరమైతే సుప్రీంకు వెళతానంటూ ఇప్పటికే పలు కింది కోర్టుల్ని ఆశ్రయించారు. ఆయన తీరుతో ఇప్పటికే విసిగిపోయిన ప్రజల మాదిరే కోర్టులు కూడా చేరుతున్నాయా? అన్న సందేహం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లుగా చెబుతున్న ట్రంప్ తరఫు న్యాయవాదులు.. వాటికి ఆధారాలు చూపించాలంటూ తెల్లముఖం వేస్తున్నారట. దీంతో.. కోర్టులు సీరియస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే అక్కడి కోర్టుల్లో ట్రంప్ వారికి ఎదురుదెబ్బలు తగలగా.. కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్ర కోర్టు సైతం జో బైడెన్ గెలుపు మీద స్టే ఇవ్వటానికి నో అంటే నో చెప్పేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా అక్కడి న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. విచారణలో వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ‘‘ఏదో జరిగిపోయిందన్న ఆరోపణలు తీవ్రమైనవి. ఎన్నికల ఫలితాల మీద ఆరోపణలు చేస్తే సరిపోదు. ఆరోపణలు వాస్తవాలు కావు. గారడీతో ఇత్తడిని బంగారంగా మార్చలేం కదా’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏదో జరిగిందన్న ఆరోపణలకు రుజువు చేసే సాక్ష్యాలేవీ ట్రంప్ తరఫు న్యాయవాది ఇవ్వలేకపోయరని కోర్టు పేర్కొంది.
పెన్సిల్వేనియా కోర్టు విచారణలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న దానికి ఆధారాలు చూపించాలని కోరగా.. తాను చేసిన వాదనల్లో అవకతవకలు జరిగాయని ఎక్కడా పేర్కొనలేదని.. కేవలం సాంకేతిక కారణాలు చూపించి ఓట్లు చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించారని మాత్రమే తాను చెప్పినట్లుగా అంగీకరించాల్సి వచ్చింది. దీంతో.. ట్రంప్ చేసిన వాదనలో పస లేదని కోర్టు పేర్కొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అయితే.. మొండి ట్రంప్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. తమ వాదన నిజమని నిరూపించుకుంటామన్న దీమాను ఆయన వర్గీయులు చెబుతున్నారు. మొండివాడిని మాటల్లో మార్చలేం కదా? ఇందుకు ట్రంప్ మినహాయింపు కారు కదా?