Begin typing your search above and press return to search.
మొండితనానికి మోడీ సర్కారు మూల్యం చెల్లించటం షురూ అయినట్లేనట
By: Tupaki Desk | 17 Feb 2021 10:00 PM ISTచేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఏమిటో కళ్లకు కట్టినట్లు కనిపించేలా పంజాబ్ రాష్ట్ర ప్రజలు సమాధానం ఇచ్చారు. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ తుడుచుపెట్టుకుపోయింది. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సాధించింది. అది కూడా ఎంతగా అంటే.. గడిచిన 53 ఏళ్లలో శిరోమణి అకాలీదళ్ కంచుకోటగా ఉన్న భాటిండాలో గెలవటం దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. వ్యవసాయ చట్టాలపై కేంద్రంలో మోడీ సర్కారు మొండితనంగా ఉండటం.. ఈ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని పంజాబీలు గడిచిన మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటానికి ససేమిరా అంటున్న మోడీషాలకు భారీ షాకిస్తూ పంజాబ్ ప్రజలు ఓటుతో తమ తీర్పును ఇచ్చేశారు. మోగా.. హోషియార్ పూర్.. కపుర్తలా.. అబోహర్.. పఠాన్ కోట్.. భటిండా మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ సొంత బలంతో గెలుచుకుంది. దీంతో.. కాంగ్రెస్ వర్గాల్లో ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్నాయి.
తాజా విజయం కాంగ్రెస్ కు ఎంత ముఖ్యమైనదంటే.. 53 ఏళ్ల తర్వాత తొలిసారి భాటిండాకు కాంగ్రెస్ మేయర్ రానున్నారని రాష్ట్ర మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు వెలువడిన మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ వశం కావటంతో బీజేపీకి దిమ్మ తిరిగే షాకులు పడుతున్నాయి. వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చేయటంతో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ కూడా విడిగా పోటీ చేసింది. ఈ రెండు పార్టీలకు చేదు అనుభవం ఎదురుకాగా.. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదంతా చూస్తున్నప్పుడు వ్యవసాయ చట్టాలపై మోడీ మాష్టారి మొండితనానికి మూల్యం చెల్లించటం షురూ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.