Begin typing your search above and press return to search.

పొలాల్లో నాటు వేస్తున్న 'టెక్కీ'లు.. విషయమెంటీ..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 11:32 AM GMT
పొలాల్లో నాటు వేస్తున్న టెక్కీలు.. విషయమెంటీ..!
X
ఉన్నత చదువులు.. ఐదంకెల జీతం.. ఎంజాయ్ చేసేందుకు వీకెండ్ సెలవులు.. ఇంతకంటే ఏం కావాలి? చెప్పండి.. ఐటీ ఉద్యోగుల లైఫ్ స్టైల్ ఇలా ఉండటం ప్రతీఒక్కరూ ఐటీ కొలువు కోసం ఆరాటపడుతున్నారు. ఏసీ గదుల్లో.. స్పీంగ్ కూర్చీలు ల్యాప్ టాప్ లు పట్టుకుని బిజీగా కనిపించే ఐటీ ఉద్యోగులు సడెన్ గా పొలాల్లో ప్రత్యక్షమై వరి నాటు వేస్తూ కన్పిస్తే ఎలా ఉంటుంది చెప్పండి?.. ఆ 'కిక్కు'ను ఐటీ ఉద్యోగులు సంగారెడ్డి రైతులకు అందించారు.

కరోనా పుణ్యమో.. సినిమాల ప్రభావమో గానీ రైతు విలువను నేటి యువత గుర్తిస్తున్నట్లే కన్పిస్తోంది. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభిపోయిన సమయంలోనూ రైతు సాగు చేయడం మాత్రం మానలేదు. రైతు ధాన్యం.. కూరగాయ పంటలు పండించడం వల్ల యావత్ ప్రపంచానికి తిండి లభిస్తుంది. ఈ క్రమంలోనే రైతు కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలోనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సలహాతో తోటి ఐటీ ఉద్యోగులంతా కలిసి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ను తాజాగా సందర్శించారు. వీరంతా ఏదో ఫోటో షూట్ కోసం కాకుండా రైతు కష్టాన్ని స్వయంగా తెలుసుకునేందుకు రావడం విశేషం. వీకెండ్ విజిట్ లో భాగంగా ఐటీ ఉద్యోగులు తెల్లాపూర్ కు చేరుకొని వరి పొలాల్లో కూలీల అవతారమెత్తి గ్రామస్తులను ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా పలువురు ఐటీ ఉద్యోగులు మాట్లాడుతూ వ్యవసాయం అంత సులువైన పనేమీ కాదన్నారు. ఆహారాన్ని తినడం చాలా ఈజీ అని కానీ వాటిని పండించడం ఎంతో కష్టంతో కూడుకున్నదని వాపోయారు. ఆ కష్టం ఒక్క రైతుకే తెలుస్తుందన్నారు. తెల్లపూర్ లోని రైతు అంజనేయుల పొలం వద్ద కూలీలు నాట్లు వేస్తుండడంతో వీరంతా వారిని చూసి నాట్లు వేయడం నేర్చుకొన్నారు.

ఆ తర్వాత పొలం మొత్తం ఐటీ ఉద్యోగులే నాట్లు వేశారు. తాము కేవలం ప్రచారం ఇలా చేయడం లేదని రైతుల కష్టాలు తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఈ పని చేసినట్లు చెప్పారు.మున్ముందు కూడా రైతులకు తమవంతు సహకారం అందిస్తామని ఐటీ ఉద్యోగులు చెప్పడం విశేషం.

పెద్ద చదువులు చదివి.. కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకులు తమ పొలాల్లో వరి నాట్లు వేయడంతో గ్రామస్థులతో పాటు ఆ పొలం యజమాని సంతోషం వ్యక్తం చేశారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు సైతం వీరిని అభినందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.