Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగులు సిద్దంకండి .... వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇక గుడ్ బై !

By:  Tupaki Desk   |   3 Nov 2020 10:00 PM IST
ఐటీ ఉద్యోగులు సిద్దంకండి .... వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇక గుడ్ బై !
X
కరోనా మహమ్మారి దెబ్బ కి ప్రపంచ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. కరోనా వైరస్ తో నష్టపోని దేశం అంటూ ఏది లేదు. ప్రపంచంలోని ప్రతిదేశం కూడా కరోనా మహమ్మారి దెబ్బకి అతలాకుతలం అయింది. కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం ఒకేసారి షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. చాలా దేశాలు పూర్తీ స్థాయిలో లాక్ డౌన్ అమలు చేశారు. ఇప్పటికి కొన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలు అవుతుంది. ఇక మరికొన్ని దేశాల్లో రెండోదశ లాక్ డౌన్ అమలు అవుతుంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించింది. గూగుల్, ఫేస్‌ బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇచ్చింది. ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ఉద్యోగులకు ఇంటి నుండి పనిని పొడిగించింది. ఈ కొన్ని సంస్థలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి.

అయితే, కొన్ని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి జోరు తగ్గుతూ ఉండటంతో కొద్ది కొద్దిగా ఆఫీసులు తెరచి, ఉద్యోగుల్ని ఆఫీసులకి పిలుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన వారికీ ఒక్కొక్కరిగా ఫోన్స్ వస్తున్నాయి. ఎవరికైనా ఇంట్లో నుండి పని చేయలేకపోతుంటే ,అటువంటి వారిని ఆఫీసుకు రమ్మని చెప్తున్నారు. అయితే , కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అటువంటి సంస్థలు కూడా ముందుగానే తమ ఉద్యోగులకి సమాచారం ఇచ్చి, ఆఫీసులకి రావడానికి సిద్ధం చేస్తున్నాయి. అయితే, ఐటీ సంస్థల్లో చాలా ప్రముఖ సంస్థలు అన్ని కూడా అమెరికా, భారత్ లోనే ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో నే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నారు.

అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పలు కంపెనీ వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి , ఆ తర్వాత ఆఫీసులకి రమ్మని చెప్పాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల పని అంశానికి సంబంధించి కూడా ఆయా దేశాల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకి ప్రాముఖ్యత ఇస్తూనే కరోనా నియమాలు పాటిస్తూ రోజురోజుకి ఆఫీసులకి వచ్చే వారి సంఖ్యను పెంచేలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే దేశంలోని ఇతర కంపెనీలు కూడా తమ ఉద్యోగులకి ఆఫీసులకి రావడానికి సిద్ధం కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చాయి. దీనికి తగట్టే ఉద్యోగులు కూడా తమ ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే , ఇప్పుడు కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో....జనవరి లోపు వ్యాక్సిన్ రాకపోతే , మళ్లీ విజృంభణ మొదలైయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనితో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటూ .. కరోనా నియమాలని పాటిస్తూ .. వచ్చే జనవరి నుండి దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు కూడా ఆఫీసుకి వచ్చి పనిచేయాలని కాల్ చేస్తున్నాయి. దీనితో కొందరు ఆఫీసులకి వెళ్లడానికి సిద్ధం కాగా .. మరికొందరు అయోమయంలో ఉన్నారు.