Begin typing your search above and press return to search.

డబ్బు కోసం భర్తను అంత దారుణంగా హింసింది చంపిన ఐటీ ఉద్యోగిని

By:  Tupaki Desk   |   30 Jan 2020 6:00 AM IST
డబ్బు కోసం భర్తను అంత దారుణంగా హింసింది చంపిన ఐటీ ఉద్యోగిని
X
ఎవరిని ఎవరూ నమ్మలేని దరిద్రపు రోజులు దగ్గరకు వచ్చేశాయా? అంటే.. అవునన్న మాట కొన్ని ఉదంతాల్ని చూసినంతనే కలుగక మానదు. చదువు సంధ్య లేనివారు.. సమాజంలో ఆదరణ కరువై నేరాలు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఉన్నత విద్యావంతులే కాదు.. ఎలైట్ గ్రూపులో బతికే ఒక ఐటీ ఉద్యోగిని తన రెండో భర్తను దారుణంగా హింసించి చంపిన వైనం విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇదెక్కడి రాక్షసత్వం అన్న భావన కలుగక మానదు.

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయన్న ఆందోళనలు పెరుగుతున్న వేళ.. తన భర్తను కిడ్నాప్ చేయించి అత్యంత దారుణంగా హింసించి వైనం సంచలనంగా మారింది. తీవ్ర గాయాలకు గురైన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వైనంలోకి వెళితే.. బెంగళూరులోని ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తుంటాడు 36 ఏళ్ల సుబ్రమణ్యం. నాలుగేళ్ల క్రితం ఐటీ ఉద్యోగిని రశ్మితో పరిచయమై.. పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమెకు పెళ్లై.. ఒక కొడుకు ఉన్నాడు.

కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల వారు డబ్బు విషయంలో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తన మొదటి భర్త వద్దకు వెళ్లింది. తర్వాత మళ్లీ సుబ్రమణ్యం వద్దకు వచ్చింది. భార్యకు డబ్బులిచ్చిన సుబ్రమణ్యం.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరటంతో ఆమెకు కోపం వచ్చింది. అదే సమయంలో తన దగ్గర తీసుకున్న రూ.5లక్షలు కూడా తిరిగి ఇవ్వాలని ఆమె సుబ్రమణ్యాన్ని డిమాండ్ చేయటంతో వారి మధ్య గొడవ చెలరేగింది.

ఇదిలా ఉంటే సోదరుడు.. తన ఇద్దరు స్నేహితుల సాయం తో భర్త సుబ్రమణ్యాన్ని కిడ్నాప్ చేయించిన రశ్మి అతడ్ని తీవ్రంగా హింసించారు. ఎంతలా అంటే.. గోళ్లు పీకేసి.. ఇనుప కడ్డీలతో కొడుతూ దారుణంగా హింసించారు. ఐదు రోజుల పాటు హింసించిన తర్వాత సుబ్రమణ్యాన్ని ఇంటి వద్దే పడేసి వెళ్లి పోయారు. అతడి దారుణ పరిస్థితిని చూసిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రశ్మిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. బెట్టింగ్ కోసం తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని.. ఈ విషయ మై తమ మధ్య రగడ జరిగిందని.. అది చివరికిలా మారినట్లుగా చెప్పినట్లు సమాచారం. దరిద్రపు డబ్బుల కోసం కట్టుకున్న భర్తను ఘోరంగా హింసించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.