Begin typing your search above and press return to search.
దారుణం: యాప్ అప్పు తీర్చలేక ఐటీ ఉద్యోగి సూసైడ్
By: Tupaki Desk | 18 Dec 2020 10:13 AM ISTమీకు రుణం ఇస్తాం.. ఎంత తేలిగ్గా అంటే.. ఇలా అప్లై చేస్తే.. అలా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామంటూ ఊరించే ప్రకటనలు ఆన్ లైన్ లో బోలెడన్ని కనిపిస్తాయి. తియ్యగా ఉండే వారి మాటలు.. అప్పు తీసుకున్న తర్వాత కానీ వారి నిజస్వరూపం ఏమిటో తెలీదు. దీనికి తోడు అప్పు తీసుకునే వేళలో.. కనిపించేవే కానీ.. కనిపించని రూల్స్ ను ప్రత్యేకంగా పట్టించుకోని వారికి నరకం అంటే ఏమిటో కనిపిస్తుంది. తాజాగా వారి బారిన పడిన ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఒక మహిళ సూసైడ్ చేసుకోగా..తాజాగా మరొకరు ఈ ఆన్ లైన్ అప్పులకు బలయ్యారు.
ఆన్ లైన్ యాప్ ద్వారా రూ.50వేల అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీని కట్టలేకపోవటం ఒక ఎత్తు అయితే.. వారు పెట్టే మానసిక హింసను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 29 ఏళ్ల సునీల్. హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో పని చేసే అతడు.. భార్య.. ఆర్నెల్ల కుమార్తెతో కలిసి కిస్మత్ పూర్ లో నివసిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో సునీల్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు
.
పలు ఆన్ లైన్ యాప్ ల ద్వారా రూ.50వేల అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడికి గురి చేశారు. దీంతో పాటు..అతడికి వ్యక్తిగతంగా రూ.6లక్షల మరో అప్పు ఉంది. వీటిని తీర్చేందుకు సొంతూరులో ఉన్న భూమిని అమ్మిన వారి తల్లిదండ్రులు ఆ అప్పు తీర్చారు. అంతేకాదు.. సునీల్ తండ్రి మరో రూ.లక్ష కూడా ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ఆన్ లైన్ లో యాప్ ద్వారా తీసుకున్న అప్పు విషయంలో.. వాటి నిర్వాహకులు ఒత్తిళ్లు తీవ్రం కావటం.. తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశాయి. అప్పును సరైన సమయంలో తీర్చలేదంటూ.. యాప్ నిర్వాహకులు సునీల్ ఫోన్లోని డేటాను తీసుకొని.. అతడి స్నేహితులు.. బంధువులకు సునీల్ డిఫాల్టర్ అంటూ అతడి ఫోటోతో మెసేజ్ పంపారు. దీంతో.. తీవ్రమైన మనోవ్యధకు గురైన అతడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాద ఉదంతంలో మరో కోణం ఏమంటే.. తాజాగా అతడికి ఒక ఐటీ కంపెనీలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఒకటి వచ్చింది. తాజాగా కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చి.. జాబ్ లో చేరాలని చెప్పగా.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఆ జాబ్ మరొకరికి ఇవ్వాలని ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. భోజనం చేయటానికి రావాలంటూ అతడి గదికి వెళ్లిన భార్య.. అప్పటికే ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవటాన్ని గుర్తించింది. ఈ ఉదంతం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.