Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వేయించుకోలేదా..? మీకు రావడం కష్టమే!
By: Tupaki Desk | 22 Dec 2021 7:00 PM ISTరెండేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ శక్తిమంతమైన ఆయుధమని వైద్య నిపుణులు ఇప్పటికే పలుసార్లు నొక్కిచెప్పారు. దేశంలో ఆ దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీని వేగవంతం చేశారు.
ఇక వివిధ కంపెనీలు సైతం ఈ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగడానికి తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. దిగ్గజ సంస్థలు చిన్న కంపెనీలు అనే తేడా లేకుండా వ్యాక్సినేషన్ కు సహకరిస్తున్నాయి. మునుపెన్నడూ లేని నిబంధనలను విధిస్తున్నాయి.
వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించడానికి ఐటీ కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఉద్యోగుల వ్యాక్సినేషన్ పైనే కాకుండా కొత్తగా జరిగే భర్తీలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. టీకా తీసుకుంటేనే ఉద్యోగం ఇవ్వడానికి సముఖత చూపుతున్నాయి.
కొత్త రిక్రూట్ మెంట్ లో కరోనా నిబంధనలను మస్ట్ గా ఫాలో అవుతున్నాయి. అందుకే టీకా కోసం ఓ ప్రత్యేక కాలమ్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఇంటర్వ్యూల్లోనూ వ్యాక్సినేషన్ పత్రానికి ప్రాధాన్యం ఇచ్చారు. అకడమిక్ ధ్రువపత్రాలతో పాటు టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ సమర్పించాల్సిందేనని కంపెనీలు కొత్త రూల్ పెట్టాయి. వ్యాక్సిన్ వేసుకోని వారికి... కొత్త ఉద్యోగం రావడం కష్టమే మరి..!
కరోనాను నియంత్రించడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. కాగా అందరూ టీకా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వంతో పాటు కంపెనీలు సైతం కృషి చేస్తున్నాయి. టీకా వేసుకుంటేనే శాలరీ అంటూ కొత్త నిబంధనను విధించాయి. ఫ్యామిలీ మొత్తం కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని... అలా అయితేనే ఉద్యోగం అంటూ ఆదేశించాయి.
గూగుల్, యాపిల్, ఇంటెల్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. నిర్ణీత గడువులోపు వ్యాక్సిన్ ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించాయి. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని... ఎంప్లాయీస్ చెప్పే ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశాయి.
సౌతాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందుతోంది. దీనిని కట్టడి చేయడానికి దేశం అన్ని రకాలుగా కృషి చేస్తోంది. అయినా కూడా కేసులు పెరుగూతూనే ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కి చేరింది. కాగా ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వేరియంట్ నుంచి పెద్దగా ప్రమాదం ఉండబోదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.