Begin typing your search above and press return to search.

టీ-కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు అగ్నిప‌రీక్షే.. కిం క‌ర్త‌వ్యం?

By:  Tupaki Desk   |   24 Dec 2022 6:35 AM GMT
టీ-కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు అగ్నిప‌రీక్షే.. కిం క‌ర్త‌వ్యం?
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు.. ఇప్పుడు అస‌లు సిస‌లు అగ్నిప‌రీక్ష ఎదురైందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. వారు కోరుకున్నది జ‌ర‌గ‌క‌పోగా.. వీరు ఎవ‌రిపైనైతే.. తీవ్ర స్థాయిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. వారి విష‌యంలో పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉంద‌నే సంకేతాలు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు ఈ వృద్ధ నేత‌లు ఏం చేస్తారు? ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఆది నుంచి కూడా సీనియ‌ర్ నేతలు.. పీసీసీ చీఫ్‌ రేవంత‌రెడ్డిని విమ‌ర్శిస్తున్నారు. ప‌క్క పార్టీ నుంచి వ‌చ్చి.. ఎప్ప‌టి నుంచో ఉన్న త‌మ‌పై పెత్త‌నం చేస్తున్నార‌ని.. వారు చెబుతున్నారు. అందుకే జ‌గ్గారెడ్డి, వీహెచ్, బ‌ట్టి విక్ర‌మార్క వంటి వారు అసంతృప్తితోనే ఉన్నారు. అదేస‌మ‌యంలో పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై జ‌గ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. వీరిని మార్చేసి.. ఎవ‌రికి ప‌ద‌వులు ఇచ్చినా స‌హ‌క‌రిస్తామంటు న్నారు.

కానీ, హైక‌మాండ్ మాత్రం దీనికి స‌సేమిరా అంటోంది. అంతేకాదు.. అధిష్టానం దూత‌గా వ‌చ్చిన మాజీ ముఖ్య మంత్రి దిగ్విజ‌య్ సింగ్ కూడా.. సీనియ‌ర్ల మాట వింటాన‌ని చెబుతూనే.. తాను చేయాల్సింది చేసేశారు. ఇది పెద్ద‌ల‌కు సంతృప్తినివ్వ‌లేదు.

ఆయ‌న వ‌చ్చారు... వెళ్లిపోయారు. పార్టీలో అన్నీ స‌ర్దుకున్నాయ‌ని చెప్పారు. కానీ, సీనియ‌ర్లు ఎదురు చూసింది.. డిమాండ్ చేసింది మాత్రం ఆయ‌న చేయ‌లేదు.

ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు సీనియ‌ర్లు ఏం చేస్తారు? అనేది ముందున్న ప్ర‌శ్న‌. అయితే.. పార్టీ మారిపోవాలి. దీనికి పెద్ద‌గా ఇప్పుడు స్కోప్ లేదు. వీరి వ్య‌వ‌హార శైలిని ఇత‌ర పార్టీలు కూడా జీర్ణించుకునే ప‌రిస్థితి లేదు. లేదా వేరు కుంప‌టి పెట్టుకోవాలి. ఇది కూడా సాధ్యం కాదు. లేదా.. ఇప్పుడున్న వారితోనే అడ్జ‌స్ట్ అయిపోవాలి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.