Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ వీసా కోసం పరుగులు అక్కర్లేదు.. హైదరాబాద్ లోనే ఏర్పాటు

By:  Tupaki Desk   |   22 Aug 2020 6:00 AM IST
ఫ్రాన్స్  వీసా కోసం పరుగులు అక్కర్లేదు.. హైదరాబాద్ లోనే ఏర్పాటు
X
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి.. వీసా కీలకమైంది. అది లేకుంటే.. ఆయా దేశాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉండదు. కొన్ని దేశాలకు నేరుగా వెళ్లిపోయి.. ఆ దేశంలోకి వెళ్లేందుకు వీసాను పొందే వెసులుబాటు ఉంటుంది. మరికొన్ని దేశాలకు మాత్రం ముందస్తుగా వీసా అనుమతి తీసుకోవాలి. ఇక.. అమెరికాకు వెళ్లాలంటే.. ముందు రాయబార కేంద్రంలో నిర్వహించే ఇంటర్వ్యూకు వెళ్లి.. అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వీసా వచ్చే వీలుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్రాన్స్ దేశానికి వెళ్లాలనుకునే తెలుగువారికి శుభవార్తగా చెప్పాలి. ఇప్పటివరకు ఆ దేశానికి వెళ్లాలంటే తెలుగు ప్రాంతాల్లో జారీ చేసే వారు కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ కు వెళ్లాలనుకునే వారు.. హైదరాబాద్ లోనే పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాదు.. కరోనా వేళ.. దేశంలోని వివిధ నగరాల్లోనూ వీసాలు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు ముంబయి.. కోల్ కతా.. చెన్నై.. బెంగళూరు.. కోచి నగరాల్లో ప్రత్యేకంగా వీసా సేవా కేంద్రాల్ని షురూ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా నగరాలకు చెందిన వారు ఫ్రాన్స్ కు వెళ్లటం మరింత సులువుగా మారనుంది.