Begin typing your search above and press return to search.
బీజేపీకి అంత ఈజీ కాదా ?
By: Tupaki Desk | 14 March 2021 7:00 AM ISTదేశం దృష్టి యావత్తు ఇపుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉంది. ఎలాగూ తమిళనాడు, కేరళలో బీజేపీకి గెలిచే అవకాశం లేదని అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లలో గెలుస్తుందనే విషయమై జనాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక పాండిచ్చేరి విషయంపై జనాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే పశ్చిమబెంగాల్, అస్సాం విషయంలో మాత్రం జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. హోలు మొత్తం మీద చూస్తే అన్నింటిలో కలిపి పశ్చిమబెంగాల్ ఎన్నికలకే టాప్ ప్రయారిటి దక్కుతోంది. అయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలో ఎవరు గెలుస్తారనే విషయం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కానీ అస్సాంలో మాత్రం బీజేపీకి తిరుగులేదనే అందరు అనుకున్నారు.
ఆమధ్య వివిధ సంస్ధలు నిర్వహించిన సర్వేల్లో కూడా బీజేపీదే మళ్ళీ గెలుపని తేలింది. కానీ అనూహ్యంగా అస్సాంలో కూడా పరిస్ధితులు మారిపోతున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. మొదట్లో ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయమని అనుకున్న వాళ్ళే అంత ఈజీ కాదని ఇపుడు చెబుతున్నారట. దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ+ప్రియాంకా గాంధి+బీజేపీ మిత్రపక్షాలే అని చెప్పాలి. గడచిన 20 రోజులుగా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందట. ఎలాగంటే బీజేపీ మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు+బోడో పీపుల్స్ ఫ్రంట్+ ముస్లిం నేతలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారట. ఇక ఈ పార్టీలకు తోడు అస్సాంలో ఉన్న వలస ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తయారయ్యారట. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వస్తే తమ ఉనికికే ముప్పుగా వలస జనాలు భయపడుతున్నారట. అస్సాంలో ఎక్కువగా బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ నుండే వలసజనాలున్నారట.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీకి ఇంతకాలం ప్లస్సుగా ఉన్న అంశాలే ఇపుడు మైనస్ అవుతున్నాయట. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరుసబెట్టి ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. ప్రియాంక ప్రధానంగా తేయాకు కార్మికులపైనే దృష్టి పెట్టారు. అస్సాంలోని మొత్తం ఓటర్లలో 20 శాతం తేయాకు కార్మికులే ఉన్నారట. 2016లో తేయాకు కార్మికుల కూలీ రేట్లను పెంచుతామని హామీ ఇచ్చిన బీజేపీ తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. దాంతో అప్పటి నుండి కార్మికులు ప్రభుత్వంపై మండుతున్నారు. ఇలాంటి అనేక అంశాలు ఇపుడు బీజేపీ గెలుపుపై ప్రభావం చూపబోతున్నాయనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. నిజంగా అదే జరిగితే నరేంద్రమోడికి పెద్ద దెబ్బనే చెప్పాలి. చూడాలి చివరకు అస్సాం తీర్పు ఎలాగుంటుందో.