Begin typing your search above and press return to search.

కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆయన మగతనంతో నాకేంటి పని: షర్మిల

By:  Tupaki Desk   |   2 Dec 2022 6:08 AM GMT
కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆయన మగతనంతో నాకేంటి పని: షర్మిల
X
ఒక ఆడమనిషి.. అందునా రాజకీయాల్లో ఉన్న మహిళా నేత మాట్లాడాల్సిన పదాలేనా? అవి అని అందరూ ఆడిపోసుకుంటున్నారు. తిట్టే మగ రాజకీయ నేతలకు ఎలాగూ బుద్దిలేదు. కనీసం మహిళ అయిన సోయి మరిచిపోయి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా అక్కడి ఎమ్మెల్యే 'పెద్ద సుదర్శన్ రెడ్డిపై' షర్మిల తీవ్రంగా నోరుజారడంతోనే టీఆర్ఎస్ శ్రేణులు ఆమెపై దాడి చేశారని.. ఆమె కార్ వాన్ ను ధ్వంసం చేశారని సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి 'మగతనం'పై కామెంట్ చేసినందుకే టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారని ప్రచారం సాగుతోంది.

దీన్నే మీడియా ప్రశ్నించగా మరోసారి వైఎస్ షర్మిల బూతు మాటలు మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 'తాను పెద్ది సుదర్శన్ రెడ్డి'ని ఏమీ అనలేదని.. అయినా ఆయన మగతనంతో నాకేం పని? పెద్ది సుదర్శన్ రెడ్డి మగతనం ఆయన భార్యకు తెలుస్తుంది.. నాకేం అవసరం' అంటూ ఫైర్ అయ్యింది. చెప్పుతో కొడతా నికృష్ణ మంత్రిని అని మాత్రమే తాను అన్నానని కవర్ చేసింది.

ఒక మహిళా నేత అయ్యిండి.. ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఆయన మగతనంతో నాకేంటి పని.. ఆయన భార్యకు తెలుస్తుంది అన్న షర్మిల మాట మరీ గలీజు రాజకీయం అని.. ఇంత బూతు మాటలు ఎవరూ సమకాలీన రాజకీయాల్లో మాట్లాడలేదని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక షర్మిల మంత్రి కేటీఆర్ ను కూడా వదలలేదు.. తనను ఆంధ్రా అమ్మాయి అంటున్న టీఆర్ఎస్ నేతలు తనది ఆంధ్రా అయితే.. 'కేటీఆర్ భార్యది మాత్రం ఆంధ్రా కాదా' అంటూ షర్మిల ప్రశ్నించింది. నా గతం ఒక్కడే.. భవిష్యత్ ఇక్కడే అంటూ కవర్ చేసింది.

ఇలా తెలంగాణ రాజకీయాల్లో మరీ బరితెగింపుగా షర్మిల మాట్లాడుతోందని.. ఇంతటీ నీచపదాలతో మాటలు తాము వినలదేని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.