Begin typing your search above and press return to search.

సూర్యుడి అంతర్థానం తప్పదా? భూమి భవిష్యత్ ఏంటి?

By:  Tupaki Desk   |   17 Aug 2022 12:30 AM GMT
సూర్యుడి అంతర్థానం తప్పదా? భూమి భవిష్యత్ ఏంటి?
X
ఈ సృష్టిలో దేనికైనా వ్యాలిడీటీ ఉంటుంది. ఎక్స్ పైరీ లేని వస్తువు లేదు. మనిషి కూడా వందేళ్లే జీవిస్తాడు. సమస్త విశ్వంలోని చాలా నక్షతాలు బాగా వెలిగి అందులో వాయువులు, మూలకలు అయిపోగానే వెలుతురు ఆపేస్తాయి. నల్లటి విశ్వంలో కలిసిపోతాయి. ఇప్పుడు మన సౌరకుటుంబానికి ఆయువు పట్టు అయిన సూర్యుడు కూడా అంతర్జానానికి సిద్ధంగా ఉన్నాడా? అంటే ఔననే అంటున్నారు.

భూమి సహా సౌరవ్యవస్థలోని గ్రహాలు అన్నీ మనుగడ సాగించడానికి సూర్యుడి సౌరశక్తినే అవసరం. అలాంటి సూర్యుడు లేని అంతరిక్షం ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. చిమ్మి చీకట్లతో ప్రపంచం అంధకారమై ఆహారం దొరక్క అందరూ అసువులు బాస్తారు. ఉన్నట్టుండి సూర్యుడు మాయమైతే ఈ ప్రపంచం, గ్రహాలు ఏమవుతాయి? వాటి పరిస్థితి ఏంటి మానవుడు ఎలా మనుగడ సాగిస్తాడన్నది ఆలోచనకు కూడా అంతుపట్టని విషయం.

సూర్యుడి అంతర్థానం అయ్యే రోజులు ఉన్నాయని అంతరిక్ష పరిశోధకులు అంచనావేస్తున్నారు. ఈ అనంత విశ్వాన్ని  చీకటి మింగేసే రోజులు రాబోతున్నాయని అంచనావేస్తున్నారు. దీనికి కారణాలు సైతం వివరిస్తున్నారు.

తాజాగా యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధీనంలో పనిచేసే గియా స్పేస్ క్రాఫ్ట్ అందజేసిన డేటాను విశ్లేషించిన అనంతరం నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం సూర్యుడు మిడ్ లైఫ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని చెబుతున్నారు. సూర్యుడి ప్రస్తుత వయసు 4.57 బిలియన్ సంవత్సరాలు. అంతరిక్షంలో సంభవించిన బిగ్ బ్యాంగ్ అనంతరం సూర్యుడు ఆవిర్భవించాడు. దాని తర్వాత గ్రహాలు ఏర్పడ్డాయి. 12 నుంచి 14 బిలియన్ సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ సంభవించింది. సూర్యుడి వయసును లెక్కించడానికి బిగ్ బ్యాంగ్ ను ప్రామాణికంగా తీసుకొని కొలిచారు.

సూర్యుడు మండడానికి దాని ఉపరితలంపై ఉన్న హైడ్రోజన్, హీలియం మిశ్రమాలే కారణం. ఇదొక నక్షత్రం అని చెప్పొచ్చు. అందులోనుంచి నిరంతరం హైడ్రోజన్, హీలియం వాయువులు వెలువడుతుంటాయి. కార్బన్, నియాన్, సల్ఫర్ వంటివి ఇందులో నుంచి వెలువడుతున్నప్పటికీ వాటి పరిమాణం చాలా తక్కువ.

సూర్యుడు మనుగడ సాగించడానికి హైడ్రోజన్ కీలకం. ఇప్పుడు దాని ఉపరితలంపై హైడ్రోజన్ తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లకు ఇది పూర్తిగా అడుగంటి పోతుందని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా సూర్యుడు ఒక మృత నక్షత్రంగా మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.గియా స్పేస్ క్రాఫ్ట్ డేటా ప్రకారం.. ద్రవ్యరాశిని కోల్పోయిన ఓ సాధారణ నక్షత్రం ఏ రకంగానైతే మృతనక్షత్రంగా మారుతుందో.. సూర్యుడు కూడా అలానే అవుతాడని చెబుతున్నారు. కానీ ఇలా సూర్యుడి అంతర్థానానికి 1011 బిలియన్ సంవత్సరాలు పడుతుందని లెక్కగట్టారు. ప్రస్తుతం సూర్యుడి వయసు మధ్య వయసు అని.. క్రమంగా కనుమరుగవుతాడని అంటున్నారు.