Begin typing your search above and press return to search.
వారికి విముక్తి ఎప్పుడు?
By: Tupaki Desk | 8 Aug 2015 10:07 PM ISTలిబియాలో కిరాతక ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల చేతిలో అపహరణకు గురైన తెలుగు ప్రొఫెసర్లు గోపీ కృష్ణ, బలరాంలకు ఇంకా విముక్తి లభించలేదు. కిడ్నాపై 10 రోజులైనా వారి ఆచూకీ దొరకలేదని సమాచారం. భారత విదేశాంగ శాఖ ఉగ్రవాదులతో జరుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడం వల్లే వారు విడుదల కాలేదని సమాచారం.
ఐఎస్ మిలిటెంట్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నా.. వారి నుంచి సానుకూల సంకేతాలు రాలేదని సిర్ట్ వర్శిటీ ఉన్నతాదికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్న గోపీ కృష్ణ, బలరాం ను విడిపించాలన్న అభ్యర్ధించేందుకు వారి కుటుంబ సభ్యులు ఇవాళ కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలుసుకున్నారు.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు వేగంగా జరగాలని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు అరాచక ఐఎస్ ఉగ్రవాదులతో ఆ దేశ ప్రభుత్వం సైతం తగు విధంగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు.