Begin typing your search above and press return to search.

కొత్త బెదిరింపు: వైట్ హౌస్‌ నే పేల్చేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   20 Nov 2015 9:32 AM GMT
కొత్త బెదిరింపు: వైట్ హౌస్‌ నే పేల్చేస్తార‌ట‌
X
మ‌రింత ప్రచారం కోరుకుంటున్నారో లేక‌.. ఉన్మాదం పీక్ స్టేజ్ కి వెళ్లిందో కానీ ఐఎస్ తీవ్ర‌వాదుల మాట‌లు కోట‌లు దాటుతున్నాయి. ఫ్రాన్స్ రాజ‌ధాని ప్యారిస్ మీద ఉగ్ర‌దాడి త‌ర్వాత నుంచి విప‌రీతంగా చెల‌రేగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదులు రోజుకో కొత్త వీడియోల‌తో వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. న్యూయార్క్ లోని ప్ర‌ఖ్యాత ప్రాంతాల్లో బాంబులతో పేల్చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంట‌ల‌కే.. తాజాగా అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నాన్ని పేల్చేస్తామంటూ మాట‌ల‌తో తెగ‌బ‌డుతున్నారు.

పారిస్ బిఫోర్ రోమ్ అన్న పేరుతో ఆరు నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదులు కొత్త వీడియోను విడుద‌ల చేశారు. ఇరాక్ లో రూపొందించిన‌ట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో ప్యారిస్ లో మ‌రిన్ని దాడుల‌తో పాటు..ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్ష భ‌వ‌న‌మైన వైట్ హౌస్ ను సూసైడ్ బాంబ‌ర్ల‌తో పేల్చేస్తామంటూ హెచ్చరించారు.

దీంతో పాటు.. అమెరికా అధ్య‌క్షుడు ఒబామాతో పాటు.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు హోలాండ్ ను సైతం ఆత్మాహుతి ద‌ళాల‌తో మ‌ట్టుబెడ‌తామ‌ని.. వారిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌మన్న హెచ్చ‌రిక ఒక‌టి చేశారు. తాజాగా ఐఎస్ తీవ్ర‌వాదులు చేస్తున్న హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.