Begin typing your search above and press return to search.

ఫుట్ బాల్ ఆడారని నలుగుర్ని నరికేసిన ఐసిస్

By:  Tupaki Desk   |   11 July 2016 12:58 PM IST
ఫుట్ బాల్ ఆడారని నలుగుర్ని నరికేసిన ఐసిస్
X
మనుషుల రూపంలో ఉన్న రాక్షసులుగా చెప్పే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తమలోని రాక్షసత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. తమ మాట వినని వారి పట్ల దారుణంగా వ్యవహరించే వారు.. తాజాగా చేపట్టిన చర్య షాకింగ్ గా మారింది. ఫుట్ బాల్ క్రీడ తమది కాదని.. దాన్ని ఆడొద్దని.. ప్రాశ్చాతులు ఆడే ఈ క్రీడను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఐసిస్ తీవ్రవాదుల నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోని నలుగురు ఫుట్ బాల్ ఆటగాళ్లు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సిరియాలో ఫుట్ బాల్ ఆడే జట్లలో ప్రముఖమైన ఆల్ షహబ్ తరఫున ఆడే నలుగురు ఫుట్ బాల్ క్రీడాకారుల్ని బంధీలుగా చేసిన ఐసిస్ తీవ్రవాదులు.. వారి తలల్ని నరికేసి రోడ్ల మీద పడేయటం కలకలం రేపుతోంది. ఐసిస్ బలం ఎక్కువగా ఉండే రక్కా పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గత ఏడాది టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారంటూ 13 మంది యువకుల్ని దారుణంగా హతమార్చారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న వీరి పాపాలు పండేదెప్పుడన్నది ప్రశ్నగా మారింది.