Begin typing your search above and press return to search.

ఐసిస్ దారుణాలు.. అత్యాచారాలు.. సెక్స్ బానిసలు

By:  Tupaki Desk   |   8 Nov 2019 9:16 AM GMT
ఐసిస్ దారుణాలు.. అత్యాచారాలు.. సెక్స్ బానిసలు
X
ఐసిస్ కామవాంఛ కు యాజిది అమ్మాయిలు బలి అయిపోతున్నారు. ఇరాక్ , సిరియాల లో ఐసిస్ ఉగ్రవాదుల అరాచకాల గురించి తెలిసి ప్రపంచమే విస్తుపోతోంది. ముస్లింలు కాని వారిని.. ముఖ్యంగా సున్నీలు, యాజిది తెగకు చెందిన వారిని ఐసిస్ ఉగ్రమూకలు వాడుకొని సెక్స్ బానిసలు మార్చిన వైనం భయానకంగా ఉంది. ప్రాచీన కాలం నుంచే ఇరాక్, సిరియా ప్రాంతాల్లో ముస్లింల లోని వేరే వర్గాలైన సున్నీలు, యాజిదీలు సహా ముస్లిం మేతరులపై అక్కడి వారు తీవ్రమైన దమనకాండకు దిగుతున్నారు. ఇక కుర్ధిష్ లను కూడా వదలకుండా ఐసిస్ ఆకృత్యాలకు బలి చేశారు.

తాజాగా ఐసిస్ ఇరాక్, సిరియా ఉత్తర భాగంలో నివసించే యాజిదీలను లక్ష్యంగా చేసుకుంది. ఐసిస్ చెర నుంచి ఇటీవలే తప్పించుకున్న యాజిదీ తెగకు చెందిన ఇమాన్ అబ్ధుల్లా అనే మహిళ ఐసిస్ చెరలోని తన భయానక కథను చెప్పుకొచ్చింది. ఆమెపై జరిగిన ఆకృత్యాలు విని ప్రపంచమే నివ్వెరపోయింది.

ఇమాన్ అబ్దుల్లా 13 సంవత్సరాల వయసులో ఐసిస్ ఉగ్రవాదుల చేతికి చిక్కింది. ఆమెను కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు దాదాపు 100 మందికి పైగా అత్యాచారం చేశారట.. అనంతరం ఇమాన్ ను సెక్స్ బానిసగా మార్చి చాలాసార్లు అనేకమంది ముష్కర మూకకు విక్రయించారని ఆమె చెబుతోంది. ఆమెను ఇలా వందలాది మంది అత్యాచారం చేస్తూ కోరిక తీరగానే తిరిగి వేరే ఉగ్రమూకలకు అమ్మేశారట.. ఇమాన్ తన కుటుంబాన్ని చేరేవరకు పదే పదే అత్యాచారానికి గురి అవుతూనే ఉందని తన నరకయాతనను చెప్పుకొచ్చింది.

తాజాగా ఇమాన్ తోపాటు ఐసిస్ చెర నుంచి బయటపడ్డ యాజిదీ తెగకు చెందిన మహిళలను హార్మోని ఫౌండేషన్ మదర్ థెరిసా అవార్డ్ తో సత్కరించింది. ఐసిస్ చెరలో ముస్లిమేతరులను ఎలాగా హింసిస్తారో చెప్పిన ఇమాన్ కన్నీటి గాథ ఇప్పుడు వైరల్ గా మారింది