Begin typing your search above and press return to search.

సామి కి సారీ చెప్పిన ఇషాంత్ శర్మ ..ఇదే కారణం !

By:  Tupaki Desk   |   3 July 2020 5:00 AM IST
సామి కి సారీ చెప్పిన ఇషాంత్ శర్మ ..ఇదే కారణం !
X
ఇక జాతి వివక్షపై యుద్ధం సాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దిగివస్తున్నాయి. తమ ప్రకటనలను సైతం మార్చుకుంటున్నాయి. అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మెడపై కాలు అదిమిపెట్టడంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ‘నల్ల జాతీయుల ప్రాణాలూ విలువైనవే’ #BlackLivesMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని డారెస్‌ సామి ఆరోపించారు. తనకు జరిగిన సంఘటనను ఎత్తి చూపించారు. ఐపీఎల్‌ లో సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్ ‌కు ఆడుతున్నప్పుడు కొందరు తనను ‘కాలూ’ అని పిలిచారని చెప్పాడు. ఇషాంత్‌ శర్మ ఇన్‌ స్టాగ్రామ్‌ లో సామిని ‘కాలూ’అంటూ చేసిన పోస్ట్‌ను చూపాడు. అయితే ఈ అంశం పై ఇషాంత్‌ తనకు ఫోన్ చేసి వివరించినట్లుగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇంతటితో ఎండ్ కార్డ్ వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే.. ఇషాంత్‌ పై తనకు ఆగ్రహం లేదని, మళ్లీ కలిసినప్పుడు మనసారా కౌగిలించుకుంటానని పేర్కొన్నారు సామి. ఇషాంత్ దురుద్దేశం తో అలా సంబోధించి ఉండక పోయి వుండ వచ్చని, ఈ విషయాన్ని ఇక్కడి తో వదిలేసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. క్రికెట్లో మాత్రం జాతి వివక్ష కు తావు ఉండ కూడదని స్పష్టం చేశారు.