Begin typing your search above and press return to search.

కోహ్లీ శ్రీలంకతో మ్యాచ్ లో ఉన్నాడేంటీ? ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు!

By:  Tupaki Desk   |   19 July 2021 4:30 PM GMT
కోహ్లీ శ్రీలంకతో మ్యాచ్ లో ఉన్నాడేంటీ? ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు!
X
''టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడు? ఇంగ్లండ్ టూర్లో ఉన్నాడు. మ‌రి, శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ లో కోహ్లీ బ‌రిలోకి దిగాడేంటీ? అది కూడా కెప్టెన్ గా కాదు. ఒక ఆట‌గాడిగా వ‌చ్చాడేంటీ!'' భారత్-శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ చూసిన వారందరూ ఒక్క‌సారిగా ఇదే డౌట్ ఫీల‌య్యారు.

అస‌లు విష‌యం ఏమంటే.. గ‌డ్డం మీసాలు తీసేసి, క్లీన్ షేవ్ చేసుకున్న కోహ్లీ మాదిరిగా క‌నిపించిన‌ ఓ యువ క్రికెట‌ర్.. సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారాడు. ఇత‌న్ని చూసిన వారంతా.. ఆశ్చ‌ర్య‌పోయారు. అచ్చం కోహ్లీ మాదిరిగానే క‌నిపించాడు. ప్ర‌స్తుతం అత‌డికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇంత‌కీ అత‌ను ఎవ‌రంటే.. అదే మ్యాచ్ లో వ‌న్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెట‌ర్ ఇషాన్ కిష‌న్‌. ధోనీ ఇలాఖా నుంచి వ‌చ్చిన ఈ క్రికెట‌ర్ కూడా వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్ మెన్ కావ‌డం విశేషం. అంతేకాదు.. ఫ్యూచ‌ర్ లో ధోనీ ప్లేస్ ను భ‌ర్తీ చేస్తాను అన్న‌ట్టుగా మొద‌టి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచ‌రీ దంచికొట్టాడు. కేవ‌లం 42 బంతుల్లోనే 2 సిక్స‌ర్లు, 8 ఫోర్ల‌తో 59 ప‌రుగులు సాధించాడు.

ఈ ఏడాది మొద‌ట్లో ఇంగ్లండ్ తో జ‌రిగిన టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడిన ఇషాన్‌.. పొట్టి క్రికెట్లోనూ మొద‌టి మ్యాచ్ లోనే చెల‌రేగి ఆడాడు. ఆ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఇక్క‌డ ఇంకో ముఖ్య విష‌యం ఏమంటే.. అత‌ను హెల్మెట్ పెట్టుకుంటే.. సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ డికాక్ లా క‌నిపించ‌డం మ‌రో విశేషం. మొత్తానికి ఇటు కోహ్లీ రూపంలో, అటు డికాక్ కాపీలా క‌నిపించి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసిన ఇషాన్ కిష‌న్‌.. అటు బ్యాటింగ్ లోనూ అద‌ర‌గొట్టి అబ్బుర ప‌రిచాడు. సోష‌ల్ మీడియాలో ఇత‌డికి సంబంధించిన ఫొటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.