Begin typing your search above and press return to search.

ఇషా అంబానీ ఉండబోయే ఇంటిని చూశారా?

By:  Tupaki Desk   |   21 Dec 2018 10:31 AM GMT
ఇషా అంబానీ ఉండబోయే ఇంటిని చూశారా?
X
దేశంలోనే అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ తన గారాల కూతురు వివాహాన్ని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా నిర్వహించాడు. దాదాపు 700 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి అంగరంగ వైభవంగా ముగిసింది. ఇప్పుడు కొత్త దంపతులు ఇషా-ఆనంద్ లు పెట్టే కొత్త కాపురంపైనే అందరి దృష్టి నెలకొంది. వారిద్దరూ నివసించబోయే ఇల్లు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

కొత్త దంపతుల కోసం ముఖేష్ అంబానీ, పిరమల్ కుటుంబం దాదాపు 50వేల చదరపు అడుగుల ఇల్లును సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంద్రభవనాన్ని తలపించేలా ఈ ఇల్లు ఉంటుందట.. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆరేబియా సముద్రప్రాంత సమీపంలో చల్లటి సముద్ర గాలుల వాలుగా ఉంటుందట.. ఆనంద్ పిరమాల్ తల్లిదండ్రులు ఈ ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఇంటిదగ్గర తుదిమెరుగులు దిద్దుతున్నారట.. కాగా ప్రస్తుతం కొత్త దంపతులు ఉంటున్న ఇళ్లుతో పోలిస్తే ముఖేష్ అంబానీ ఉంటున్న ఇల్లు యాంటిలియా దాదాపు 8 రెట్ల పెద్దదిగా ఉంటుందట..