Begin typing your search above and press return to search.

తమిళ ఎన్నికల ’ శ్రీమంతుడు’ ఈయనే..!

By:  Tupaki Desk   |   19 March 2021 3:23 AM GMT
తమిళ ఎన్నికల ’ శ్రీమంతుడు’ ఈయనే..!
X
ఎన్నికల వేళ రాజకీయ నాయకుల ఆస్తులు బయటపడుతూ ఉంటాయి. పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్​లో తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. దీంతో ఆయా రాజకీయా నాయకులు తమ ఆస్తులను ప్రకటిస్తుంటారు. అయితే ఇందులో పేర్కొన్న ఆస్తుల వివరాలు నిజాలేనా? బినామీ ఆస్తులు ఇంకా చాలా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. చాలా మంది రాజకీయ నాయకులు తమ ఆస్తులను లక్షల్లోనే చూపిస్తూ ఉంటారు. కేవలం ప్రభుత్వ మార్కెట్​ ప్రకారమే ఆస్తులు చూపిస్తారు.. కాబట్టి బహిరంగ మార్కెట్​లో ఆస్తుల విలువ రెట్టింపు ఉండొచ్చు అది వేరే విషయం.

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాజకీయపార్టీల అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్​లో దాఖలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు నామినేషన్​ దాఖలు చేసిన అభ్యర్థుల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య అత్యంత ధనికుడిగా నిలిచారు. ఆయన ఆస్తి రూ. 246 కోట్లు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్​లో వివరాలు నమోదు చేశారు.

మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్, ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ ఆస్తులు మూడు డిజిట్‌ కోట్లలో ఉన్నాయి. కమలహాసన్‌ ఆస్తి రూ.177 కోట్లుగా, మహేంద్రన్‌ ఆస్తి 160 కోట్లు.

ఇసక్కి సుబ్బయ్య ఆస్తి 2011లో ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రూ.60 కోట్లు మాత్రమే. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తి అనూహ్యంగా పెరిగింది.సుబ్బయ్య గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు. తాజాగా ఆయనకు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం టికెట్​ దక్కింది. దీంతో బుధవారం నామినేషన్​ దాఖలు చేశారు.

తన ఆస్తి విలువ రూ. 246 కోట్లు అని సుబ్బయ్య ప్రకటించారు.

సుబ్బయ్య భార్య మీనాక్షి పేరిట చర ఆస్తులు రూ. 6.86 కోట్లు అని, స్థిర ఆస్తులు రూ. 239 కోట్లు అని లెక్కచూపించారు. అప్పులు రూ. 5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇసక్కి సుబ్బయ్య ఆస్తి నాలుగు రెట్లు పెరగడం గమనార్హం.చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించారు. మరోవైపు తమిళనాట ప్రచారం ఊపందుకున్నది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.