Begin typing your search above and press return to search.
ఛాన్స్ వచ్చింది.. బాబు చిక్కినట్టేనా?
By: Tupaki Desk | 29 Dec 2022 10:29 AM ISTఎప్పుడెప్పుడు.. టీడీపీని ఇరుకున పెట్టాలా? అని ఎదురు చూస్తున్న ఏపీ అధికారపార్టీ వైసీపీకి ఎన్నికల ముందు పెద్ద ఛాన్స్ వచ్చిందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు చంద్రబాబు వైసీపీకి అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. చిన్న చిన్న కేసులు పెట్టినా.. అవి పెద్దగా పరిగణనలోకి రాలేదు. సో.. ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన మాత్రం బాబుకు సంకటంగానే మారింది.
మొత్తం 8 మంది చనిపోవడం, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ ఘటన పెద్దగానే భావించా ల్సి ఉంటుంది. పైగా ప్రతిపక్షపై తీవ్ర అక్కసుతో ఉన్న వైసీపీ నేతలకు ఇది అంది వచ్చిన వరంగా మారింది.
ఈ నేపథ్యంలోఈ ఘటనను బూచిగా చూపించి కేసుల కొరడా ఝళించే అవకాశం ఉందనే చర్చ సాగుతుండడం గమనార్హం. ఇది సహజంగానే జరుగుతుంది. సభ నిర్వాహకులు సరైన చర్యలు చేపట్టలేదనే కారణంగా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది.
అయితే, ఇక్కడ పారదర్శకంగా కాకుండా.. రాజకీయ కోణం ఖచ్చితంగా తెరమీదికి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో జరిగే సభలకు అనుమతులు ఇవ్వకుండా నిలువరించడంతోపాటు.. నిబంధన లు కఠినతరం చేయడం.. ప్రజలను, అభిమానులను నిలువరించడం.. వంటివి తెరమీదికి వస్తాయి. నిజానికి ఇలాంటి అవకాశం కోసమే వైసీపీ ఎదురుచూస్తోందని.. తరచుగా చంద్రబాబు కూడాచెబుతున్నారు.
అందుకే ఆయన తన పార్టీ నేతలనుతరచుగాహెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా చెబుతున్నారు. అయితే.. తాజాగా అనుకోని విపత్తు జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎలా వ్యవహరించినా.. కేసుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే.. ఈ కేసులు చంద్రబాబుపై ఉంటాయా? పార్టీ నేతలపైనా.. అనేది ఆసక్తిగా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.