Begin typing your search above and press return to search.

ఏపీసీసీ మాజీ చీఫ్ జంప్.. రాజ్యసభ కన్ఫార్మ్

By:  Tupaki Desk   |   19 Feb 2020 3:45 PM IST
ఏపీసీసీ మాజీ చీఫ్ జంప్.. రాజ్యసభ కన్ఫార్మ్
X
త్వరలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం అధికార పార్టీకే దక్కనున్నాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ స్థానాలకు ఎవర్నీ ఎన్నుకోవాలో పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఎవరెవరిని రాజ్యసభ పంపాల్నో సామాజిక సమీకరణలు, రాజకీయ లెక్కలు ఆ పార్టీ వేస్తోంది. ఈ క్రమంలో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవిని పంపించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో స్థానానికి మరో వ్యక్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన వేరే పార్టీలో ఉన్నారు. అతడిని తమ పార్టీలోకి చేర్చుకుని ఏకంగా రాజ్యసభకు పంపించాలని జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలోని వ్యక్తి ఎవరు? అంతగా పార్టీలోకి తీసుకుని మరి రాజ్యసభకు పంపించాల్సిన స్పెషల్ వ్యక్తి ఎవరో చర్చనీయాంశమైంది.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు, వైఎస్సార్ హయాంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి రఘువీరారెడ్డి. అనంతపురము జిల్లా మడకశిరకు చెందిన రఘువీరారెడ్డి మొదటి నుంచి వైఎస్సార్ వెంట ఉన్నారు. వైఎస్సార్ కు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి వైఎస్సార్ అకాల మరణంతో ఒంటరయ్యారు. ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. విభజన అనంతరం కాంగ్రెస్ లోని నాయకులంతా పార్టీలు మారగా రఘువీరారెడ్డి ఒక్కరే సొంత పార్టీలోనే ఉంటున్నారు. ఇటీవల వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. పార్టీలో సమీకరణాలు కుదరక పోవడంతో తండ్రికి మంచి దోస్త్ గా ఉన్న రఘువీరారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని ఒక ఆలోచన చేశారని అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మొదట ఈ రాజ్యసభ స్థానానికి ఇటీవల టీడీపీ నుంచి పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావును రాజ్యసభకు పంపాలని ప్రతిపాదన చేశారు. అయితే ఈ నిర్ణయానికి పార్టీ నాయకులు అంగీకరించలేదు. ఆయనకు అవసరం లేదని చెప్పడంతో పార్టీ మరొకరిని ఆలోచిస్తుండగా రఘువీరారెడ్డి గుర్తుకు వచ్చారు. పార్టీలో రెడ్ల తర్వాత బీసీలే ప్రధాన సామాజిక వర్గం. అదే సామాజిక వర్గానికి చెందిన రఘువీరారెడ్డిని రాజ్యసభకు పంపితే సామాజిక సమీకరణాలు కలిసొస్తాయి. పైగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అందరూ ఓ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గంలో యాదవ కులానికి చెందిన రఘువీరారెడ్డిని పంపిస్తే రాజకీయంగా కలిసొస్తుందని, పార్టీ అటు బీసీలను అక్కున చేర్చుకున్నట్లు సందేశం వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు రఘువీరారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభకు పంపే నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఇదే జరిగే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ సాగుతోంది.