Begin typing your search above and press return to search.
వైసీపీ లాజిక్ మిస్ అవుతోందా?
By: Tupaki Desk | 28 Aug 2020 10:00 AM IST‘‘జనాలు వైసీపీని గెలిపించారంటే.. దానర్థం.. టీడీపీ అంటే అస్సలు ఇష్టం లేదని.. వారి పరిపాలనపై చీత్కారం వచ్చిందని.. ఆ టీడీపీ నేతలు మాకు వద్దు అని.. కానీ ఈ లాజిక్ మిస్ అవుతున్న వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఓడిన ఆ టీడీపీ దిగ్గజ నేతలను అక్కున చేర్చుకొని మరో తప్పు చేస్తోందా?’’ అన్న అనుమానాలు ప్రజల్లో..క్షేత్రస్థాయి వైసీపీ నేతల్లో కలుగుతున్నాయట..
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను.. 22 మంది ఎంపీ సీట్లను చేజిక్కించుకుంది. ఎవరికీ రాని మెజారిటీ జగన్ కు వచ్చింది. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలను ఎందుకు ఇంకా పార్టీలో చేర్చుకోవడం అని వైసీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారట..మాకే పనులు కావడం లేదు అని.. మళ్లీ టీడీపీ వాళ్లను తెచ్చి ఎక్స్ ట్రా తలకాయనొప్పి తెచ్చుకోవడం ఏందని వైసీపీ క్షేత్రస్థాయి నేతలు వాపోతున్నారు. ఇందుకు ఉదాహరణలు చెబుతున్నారు.
కడప జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో బలమైన రెండు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వర్గాలు ఆది నారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డిలకు చంద్రబాబు సంధిచేసి కలిసి పోటీ చేసేలా ఒప్పించారు. ఇద్దరినీ సెట్ చేశానని.. ఇక విజయం తనదేనని చంద్రబాబు అనుకుంటే.. ఎన్నికల్లో కొత్తవాడైన వైసీపీ తరుఫున నిలబడ్డ సుధీర్ రెడ్డికి జనాలు 51వేల మెజార్టీ ఇచ్చారు.
ఎంత దిగ్గజ ఫ్యాక్షన్, అభిమాన నేతలైనా సరే జనాలు ఓడించారంటే వారిపై వ్యతిరేకతతోనే.. ఓటర్లకు వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. కానీ ఓడిన వారినే వైసీపీ మళ్లీ చేర్చుకుంటూ వారికే అధికారం కట్టబెడుతున్న వైనం విస్తుగొలుపుతోంది. ఈ లాజిక్ వైసీపీ ఎందుకు మిస్ అవుతుందో తెలియడం లేదని గ్రామాల్లోని తలపండిన వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.