Begin typing your search above and press return to search.
వైఎస్ఆర్ ను అప్పుడే మర్చిపోతున్నారా?
By: Tupaki Desk | 3 Sept 2020 11:45 AM ISTపార్టీ ఆదర్శుడిని పట్టించుకోవడం లేదు.. పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. వైసీపీ టికెట్ పై.. జగన్ గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన మాటనే వినడం లేదా? వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎందుకీ నైరాశ్యం.. పార్టీ ఆదేశించినా పట్టించుకోనంత తీరిక లేదా? వైసీపీలో ఏమిటీ వైపరీత్యం అని క్షేత్రస్థాయి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట..
వైఎస్ఆర్ వర్ధంతి రోజున వైసీపీ పార్టీ అందరి ఎమ్మెల్యేలకు ఒక సర్క్యూలర్ పంపించింది. ప్రతి వైఎస్ఆర్ విగ్రహంకు రంగులు వేసి పూలదండలతో అలకరించమని స్పష్టం చేసింది.
అయితే అధికార వైసీపీ ఆదేశానికి రాష్ట్రంలో కనీస స్పందన కరువైందట.. వైఎస్ఆర్ విగ్రహాల్లో కనీసం 10శాతం వాటికి కూడా రంగులు వేయలేదంట.. చాలా మంది ఎమ్మెల్యేలు అసలు దండా కూడా వేయలేదంట.. వాళ్లలో ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల కొందరు రాలేదట.. కరోనా భయంతో భయపడి కొందరు.. ఇంకొందరు అసలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదట.. అస్సలు పార్టీ ఆదేశాలను పట్టించుకోలేదట..
చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ అభిమానులు.. రైతులు దండలు కొనుక్కొని వేశారని..ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోలేదు అని వైఎస్ఆర్ అభిమానులు వాపోతున్నారు.
ఇప్పుడు వైసీపీ పార్టీ అన్నది ఉంది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ వల్లే. ఆయన వారసత్వంతో జగన్ వచ్చాడు. ఆయన ఆశయాలతో వైసీపీని పెట్టాడు. తండ్రిపేరునే పార్టీగా మలిచాడు. అలాంటి వైఎస్ఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలే మరిచిపోవడం గమనార్హం. ఇది పార్టీలోని నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని పలువురు చెబుతున్నారు.