Begin typing your search above and press return to search.
ఎన్డీయేలోకి జగన్ పార్టీ వార్తల్ని తేల్చేసిన బీజేపీ
By: Tupaki Desk | 7 Oct 2020 11:00 AM ISTతాజాగా జరిగిన ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీపై భారీ ఎత్తున అంచనాలు వెల్లువెత్తాయి. ఒక దశలో.. ఎన్డీయేలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని.. కేంద్ర కాబినెట్ లోనూ జగన్ పార్టీ ఎంపీల్ని తీసుకుంటారన్న మాట వినిపించింది. అయితే.. ఇవి కేవలం కల్పితాలేనని.. ఊహాగానాలుగా పలువురు తప్పుపట్టారు. అయితే.. బీజేపీకి చిరకాల మిత్రులైన శివసేన.. అకాలీదళ్ లు బయటకు వచ్చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు అవకాశం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. ఇప్పటికిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోకి చేర్చుకుంటే.. కొత్త విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు పరిమిత మిత్రత్వం కాస్తా.. పూర్తిస్థాయి మిత్రుడిగా రూపాంతం చెందితే చాలానే అంశాలు చర్చకు వస్తాయని.. అందుకు బీజేపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు.
ఎన్డీయేలోకి జగన్ పార్టీని చేర్చుకోవటం ఇప్పట్లో సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. ఇదే సందర్భంగా బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. ఎన్డీయేలోకి జగన్ పార్టీ వస్తుందన్న వార్తల్లో నూటికి 200 శాతం తప్పుగా తేల్చేయటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయేలోకి జగన్ ను చేర్చుకునే అవకాశం లేదనే మాట బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ కు సైతం ఎన్డీయేలో చేరటంపై పెద్ద ఆసక్తి లేదంటున్నారు.
ఇప్పటివరకు సాగిన స్నేహం తరహాలోనే ఇక ముందు సాగితే మంచిదన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అవసరాలకు ఇచ్చి పుచ్చుకునే తీరులో మిత్రత్వం ఉండాలే తప్పించి.. ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన నాలుగైదు పదవుల కన్నా ఇంకేం ఉండదన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ఎన్డీయేలో చేరాలన్న ఆసక్తి జగన్ ప్రదర్శించటం లేదన్న మాట వినిపిస్తోంది.