Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బీజేపీని న‌మ్మి మోస‌పోతున్నారా?

By:  Tupaki Desk   |   1 Nov 2021 8:00 AM IST
జ‌గ‌న్ బీజేపీని న‌మ్మి మోస‌పోతున్నారా?
X
జ‌గ‌న్‌కి భారీ విజ‌యం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌నివిధంగా 151 సీట్ల తో అతి పెద్ద పార్టీగా వైసీపీ అవ‌త‌రించింది. ఇక‌, ఎంపీలు కూడా 22 మంది ద‌క్కారు. మ‌రి ఇంత దూకుడు.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉండి.. కూడా ఆయ‌న బీజేపీ మీద ఆధార‌ప‌డుతున్నార‌ట‌. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. జ‌గ‌న్‌పై పలు కేసులు ఉండ‌డ‌మే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఏళ్ల త‌ర‌బ‌డి వాటిపై విచార‌ణ సాగుతోంది. దీంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో .. అనే ఆందోళ‌న క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. బీజేపీకి అనుకూలంగా ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. రాష్ట్రంలోని పాతిక మంది ఎంపీల‌ను.. త‌మ‌కే ఇస్తే.. రాష్ట్రానికి కావాల్సిన వ‌న్నీ.. కేంద్రం నుంచి తీసుకువ‌స్తా న‌ని.. జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్ర‌త్యేక హోదా వ‌స్తే.. ఏపీలో నిరుద్యోగం అనేదే ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు..కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వం మెడ‌లు వంచి ఏపీ అవ‌కాశాల‌ను సాధించే దిశ‌గా కృషి చేస్తామ‌ని చెప్పారు. అయితే.. దీనిని నమ్మిన ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు 22 మంది ఎంపీల‌ను గెలిపించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ సాధించింది ఏమీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

పైగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను ప‌న్నెత్తు మాట అన‌క‌పోవ‌డ‌మే కాదు.. ఎవ‌రైనా.. మోడీని ఏమైనా..అంటే. వెంట‌నే సీఎం జ‌గ‌న్ వ‌కాల్తా పుచ్చుకున్న సంద‌ర్భాలు.. జార్ఖండ్ ముఖ్య‌మంత్రి విష‌యంలో మ‌నం చూశాం. అంతేకాదు.. కేంద్రంలో బీజేపీకి భారీ మెజారిటీ వ‌చ్చింది కాబ‌ట్టి, ఏమీ చేయ‌లేము.. అని సెల‌విస్తున్నారు జ‌గ‌న్‌. మ‌రోవైపు.. దేశంలో నిత్యావ‌సర స‌రుకుల ధ‌ర‌లు పెరిగినా.. పెట్రో ధ‌ర‌లు పెరిగినా.. వైసీపీ ఏమీ చేయ‌కుండా.. బీజేపీ మాయ‌లో ప‌డింద‌ని.. టీడీపీ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తోంది.

కానీ, ఇక్క‌డో ఒక చిత్ర‌మైన ఘ‌ట‌న ఉంది. టీడీపీ కూడా బీజేపీకి ల‌వ్ లెట‌ర్స్ రాస్తూ.. జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టేలా చేస్తున్నారు. ఎందుంటే.. ఏదో చిన్న విష‌యంపై చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లారు. అయితే.. దీనిపై వెంట‌నే స్పందించిన వైసీపీ నాయ‌కులు.. ఉలికిపాటు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ.. చంద్ర‌బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌దు.. అని పేర్కొన్నారు. అంతేకాదు.. కొంద‌రు క్షేత్ర‌స్థాయి నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఒక చిత్ర‌మైన విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది.

అమిత్‌షా.. చంద్ర‌బాబుకు స్వ‌యంగా ఫోన్ చేశార‌ని.. త్వ‌ర‌లోనే అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పార‌ని. టీడీపీ నాయ‌కులు చెప్పుకొచ్చారు. అయితే.. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ.. బీజేపీపై ఈగ వాలనివ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కేవ‌లం బీజేపీని న‌మ్మితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. బీజేపీకి వైసీపీ అన్నా.. టీడీపీ అన్నా.. ఒక్క‌టే. ఎవ‌రికి ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ ఉంటే.. అటు వైపు ఉంటుంది. సో.. బీజేపీ వ్యూహాన్ని ప‌సిగ‌ట్టి అడుగులు వేస్తేనే.,. జ‌గ‌న్‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.