Begin typing your search above and press return to search.

175/175.. వైసీపీది ఆత్మ‌విశ్వాస‌మా.. అతివిశ్వాస‌మా?!

By:  Tupaki Desk   |   10 Jun 2022 5:38 AM GMT
175/175.. వైసీపీది ఆత్మ‌విశ్వాస‌మా.. అతివిశ్వాస‌మా?!
X
రాజ‌కీయాల్లో విశ్వాసం ఉండొచ్చు.. ఆత్మ విశ్వాస‌మూ ఉండొచ్చు. కానీ, అతి విశ్వాసం మాత్రం ప‌నికిరాదు. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ విష‌యంలో ఓవ‌ర్ కాన్ఫిడెన్సే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఏకంగా.. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు 175 గెలిచి తీరాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. అంటే..త న పాల‌న‌ను చూసి ప్ర‌జ‌లు పూర్తిగా విజ‌యం అందిస్తార‌నే ఆయ‌న భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగానే.. జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు.

అదేస‌మ‌యంలో విచ్చ‌ల‌విడిగా.. ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చారు. రాజ‌న్న రాజ్య తెస్తానంటూ.. వైఎస్ సెంటి మెంటును నూరిపోశారు. మ‌రోవైపు... జ‌గ‌న్ త‌ల్లి, చెల్లి విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌లు కూడా కాలికి బ‌ల‌పం క‌ట్టుకు ని.. ఊరూవాడా ఒక్క చాన్స్ అంటూ.. ప్ర‌చారం చేశారు. అంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌+త‌ల్లిచెల్లి ప్ర‌చారం + వైఎస్ సెంటిమెంట్‌+ విచ్చ‌ల‌విడి హామీలు+ఒక్క ఛాన్స్ ఇన్ని క‌లిస్తే.. త‌ప్ప‌.. వైసీపీకి 151 సీట్లు రాలేదు. ఇంత సెగ‌లోనూ.. వైసీపీ సునామీలోనూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ 23 సీట్లు.. ద‌క్కించుకుంది.

అదేస‌మ‌యంలో ఏమీలేద‌ని అనుకున్న జ‌న‌సేన కూడా ఇంత హోరు గాలిలోనూ.. ఒక స్థానంలో విజ‌యం ద‌క్కించుకుంది(రాజోలు). అయితే.. ఈ వాపును చూసి.. బ‌లుపు అనుకుంటున్నారో.. ఏమో.. జ‌గ‌న్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా 175కు 175 సీట్లు సాధించాల‌ని.. ఇదేమంత క‌ష్టం కాద‌ని.. కూడా చెబుతున్నారు.

తాజాగా పార్టీ నాయ‌కులు,, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఇదే విష‌యం చెప్పారు. వాస్త‌వానికి జ‌గ‌న్ త‌న పాల‌న‌పై త‌ను ఆనందంగా ఉన్నా.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం ఈక్వేష‌న్లు త‌న్నేస్తున్నాయ‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్ బాగా పాలిస్తాడన‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. కానీ, ఇప్పుడు ఈ మూడేళ్ల పాల‌న చూసిన త‌ర్వాత‌.. వారిలో విశ్వాసం స‌న్న‌గిల్లింద‌నేది వాస్త‌వం. సంక్షేమం ఇస్తున్నా.. కొంద‌రికే అందుతోంది. దీనికి తోడు మెజారి ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌పుతున్నారు. ధ‌ర‌లు మండుతున్నాయి. ప‌న్నులు పెంచారు.

ఇక‌, రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం లేదు. ప్ర‌జ‌లు కూడాతీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రి ఇన్ని మైన‌స్‌లు ఉన్న‌ప్పుడు.. 175 ప్థానాల్లో గెలుస్తామ‌ని..చెప్ప‌డం.. అతి విశ్వాసం కాక‌మ‌రేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు.