Begin typing your search above and press return to search.

ఏపీలో యానాంను విలీనం చేయబోతున్నారా .... కారణం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   8 Nov 2019 6:09 AM GMT
ఏపీలో యానాంను విలీనం చేయబోతున్నారా .... కారణం ఏమిటంటే ?
X
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ రూపురేఖలు మరోసారి మార బోతున్నాయి అని తెలుస్తుంది. ఇప్పటికే పలు సార్లు ఏపీ తన రూపాన్ని మార్చుకుంది. తాజగా మరోసారి మార్చుకోబోతుంది అని కేంద్రం కదలికల్ని బట్టి అర్థమౌతుంది. ఆంధ్రరాష్ట్రంగా ఉన్న ఏపీ లో తెలంగాణ ని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గా అప్పట్లో మార్పు చేసారు. ఆ తరువాత 2014లో ఏపీని రీఆర్గనైజ్ చేసి తెలంగాణ ను మళ్ళీ ఏపీ నుండి విడగొట్టారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏపీలో మరో కొత్తగా ఓ ప్రాంతాన్ని చేర్చడాని కి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. అదేమిటంటే .. పుదుచ్ఛేరి లోని యానాం ని త్వరలో ఏపీ లో విలీనం చేయబోతున్నారు. అసలు యానాం ని ఎందుకు విలీనం చేయబోతున్నారో ? చూద్దాం..

పుదుచ్ఛేరి రాష్ట్రం లో ఒకే ఒక పార్లమెంట్‌ స్థానం ఉంది. ఈ రాష్ట్ర పరిధి లో మొత్తం 30అసెంబ్లి స్థానాలు ఈ పార్లమెంట్‌ పరిధిలోకొస్తాయి. మిగిలిన 29 అసెంబ్లి స్థానాల్లోని ఓటర్ల కంటే యానాం లో ఓటర్ల సంఖ్య ఎక్కువ. గత కొన్ని ఎన్నికలుగా యానాం ఓటర్లు కాంగ్రెస్‌ కే పట్టంగడుతున్నారు. దీనితో పుదుచ్ఛేరి లో బీజేపీ జెండా ఎగురవేయాలన్న కోరిక కలగానే మిగిలిపోతుంది. ఈ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ముఖ్యమంత్రి తో సమాన స్థాయి కలిగిన ఎంపీ స్థానం నుంచి విజయం సాధించాలన్నా యానాం అసెంబ్లి అడ్డుగా ఉందన్న విషయాన్ని బిజెపి గుర్తించి, దీంతో యానాం అసెంబ్లిని పుదుచ్ఛేరి నుంచి విడదీసి ఆంధ్రా లో విలీనం చేస్తే తప్ప తమ ఆకాంక్ష నెరవేరదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి ఏపీ సీఎం జగన్ కూడా సముఖత వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం జగన్ తీసుకున్న మధ్య నిషేధం. ఏపీ లో మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలులో కూడా పెడుతున్నాడు. కానీ , తూర్పుగోదావరిని ఆనుకునున్న యానాం పట్టణం నుంచి జిల్లా మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పంపిణీ అవుతోంది. ఏటా 20శాతం చొప్పున దుకాణాల్ని తగ్గించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాని కి యానాం ఒక అతి పెద్ద అడ్డంకిగా మారింది.దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్‌ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. యానాం మద్యం ఉండగా ఏపీలో మద్య నియంత్రణ లేదా నిషేదం అమలు సాధ్యం కాదని కేంద్రం దష్టికి తెచ్చారు. స్వతంత్ర హోదా కలిగిన పుదుచ్ఛేరిలో భాగమైనా యానాం లో మద్యం అమ్మకాల్ని నిషేదించే అధికారం ఎపికిలేదు. దీంతో మొత్తం యానాంనే తన పరిధిలో విలీనం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని జగన్‌ కేంద్ర హోం శాఖకు సూచించారు.

భౌగోళికంగా యానాం అతిచిన్న పట్టణం. ఇది 31.8చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2011లెక్కల మేరకు ఇక్కడ జనాభా 55,616మంది. ఇక్కడ తెలుగుతో పాటు తమిళం, ఫ్రెంచ్‌, మాట్లాడే వ్యక్తులు అధికంగా కనిపి స్తారు. ప్రభుత్వ కార్యాలయాల పై తెలుగుతో పాటు తమిళంలోనూ బోర్డులుంటాయి. ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్‌ కిరణ్‌బేడి యానాంలో పర్యటించారు. స్థానిక అధికారుల్తో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించారు.దేశం మొత్తం కాంగ్రెస్‌ ఉనికి కోల్పోతున్న ఈ చిన్ని పట్టణంలో మాత్రం ఇంకా బలంగా ఉందన్న విషయాన్ని ఆమె తెలియజేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ను దెబ్బ కొట్టాలంటే విలీనం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది.