Begin typing your search above and press return to search.

ఏకైక రాజధాని విశాఖపట్నమా?

By:  Tupaki Desk   |   22 Nov 2021 7:02 AM GMT
ఏకైక రాజధాని విశాఖపట్నమా?
X
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ బిల్లు ప్రతిపాదించి కర్నూలును న్యాయరాజధానిగా.. విజయవాడను శాసన రాజధానిగా.. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, టీడీపీ నేతలు ఏడాదిన్నరగా ఉద్యమిస్తూనే ఉన్నారు.

కొందరేమో ఏకంగా హైకోర్టుకు వెళ్లి పిటీషన్లు వేసి అడ్డుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నా అదీ ముందుకు సాగడం లేదు. టీడీపీ ఎంత వ్యతిరేకిస్తున్నా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా మొండిపట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మూడు రాజధానుల బిల్లును సీఎం జగన్ వెనక్కి తీసుకోవడం సంచలనమైంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇదే జరిగితే పెను సంచలనం కానుంది.

ఇప్పటికే మూడు రాజధానులను మార్చాలనుకున్నా హైకోర్టులో తేలేలా లేదు. ఈ క్రమంలోనే జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. ఏపీకి మూడు రాజధానులు కాకుండా ఒకటే రాజధానిని చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

మూడు రాజధానులతో సమస్యలున్నాయి. న్యాయ చిక్కులున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టులో తేలేలా లేదు. ఒకటే రాజధాని ఒక రాష్ట్రానికి ఉండాలన్న డిమాండ్ ఉంది. దేశంలో అన్ని అలాగే ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు అమరావతిని జగన్ పక్కనపెడుతారా? లేక అమరావతినే రాజధానిగా ప్రకటిస్తారా? లేదంటే ఏపీలోనే పెద్ద నగరమైన విశాఖనే ఏపీకి ఫుల్ టైం రాజధానిగా జగన్ ప్రకటిస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏపీకి రాజధానిగా అమరావతినా? విశాఖపట్నం ఉంటుందా? అన్నది జగన్ ఏం డిసైడ్ చేశాడన్నది మరికొద్దిసేపట్లో తేలనుంది. విశాఖను పక్కన పెట్టి అమరావతినే రాజధానిగా ప్రకటిస్తారని కొందరు.. లేదు లేదు విశాఖనే ఏకైక రాజధానిగా జగన్ చేయబోతున్నాడని మరొకొందరు అంటున్నారు. మరి జగన్ ఏం నిర్ణయిస్తారన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది.

మరికాసేపట్లోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో వెనక్కి తీసుకోబోతున్న జగన్.. ఆ వెంటనే ఏపీకి కొత్త రాజధాని ప్రకటిస్తారని.. అది విశాఖ అయినా.. అమరావతి అయినా.. పూర్తి స్థాయి రాజధాని నుంచే పనిచేస్తాడని సమాచారం. మరికాసేపట్లోనే దీనిపై క్లారిటీ రానుంది. అసెంబ్లీలో జగన్ ప్రకటన చేయనున్నారు.