Begin typing your search above and press return to search.

ట్రంప్ ఖేల్ ఖతం.. దుకాణం సర్దేశాడా?

By:  Tupaki Desk   |   7 Nov 2020 1:00 PM IST
ట్రంప్ ఖేల్ ఖతం.. దుకాణం సర్దేశాడా?
X
ఓట్ల లెక్కింపులో ట్రంప్ వెనుకబడిపోతున్నారు. 269 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి గెలుపునకు ఒక్క ఓటు దూరంలో ప్రత్యర్థి జోబిడెన్ నిలిచిపోయాడు. అమెరికా అధ్యక్షుడిగా జోబిడెన్ గెలుపు ఖాయమవుతోంది. రిపబ్లికన్ల కంచుకోట అయిన ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో సైతం డెమొక్రట్ జెండా ఎగరడం.. జోబైడెన్ ఆధిపత్యం సాధించడంతో తట్టుకోలేని ట్రంప్ దుకాణం సర్దేశిస్తున్నట్టు తెలిసింది. జోబిడెన్ కు అనుకూలంగా మారుతున్న పరిణామాలపై మండిపడుతున్న ట్రంప్ అధ్యక్ష భవనం ఖాళీ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈ అనుమానాలకు బలం కలిగేలా తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు ‘పెన్ స్కే’ కంపెనీకి చెందిన ట్రక్కు నిలిచినట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

పెన్ స్కే కంపెనీ ట్రక్కు సర్వీసులకు పెట్టింది పేరు. వీవీఐపీలు సహా చాలా మంది తమ సరుకుల బట్వాడాకు ఆ కంపెనీ ట్రక్కులనే ఉపయోగిస్తారు. ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖరారైన నేపథ్యంలో కోపంతో రగిలిపోతున్నాడట.. అలకతో అధ్యక్ష భవనం ఖాళీ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తాజాగా ట్రక్కు కనిపించడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. మెలానియా ముందే ఇల్లు విడిచి పోతున్నది అంటూ సెటైర్లు వేస్తున్నారు.ప్రజల భవనం ఇక ప్రజలకే దక్కుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా ట్రంప్ ఓడినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. జనవరి 20వ తేది వరకు ఆయనకు టైం ఉంది. 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసేనాటికి ఖాళీ చేయాల్సి ఉంటుంది.