Begin typing your search above and press return to search.

వుహాన్ ల్యాబ్ లో కరోనా సృష్టి..ట్రంప్ ఆరోపణల్లో నిజమెంత?

By:  Tupaki Desk   |   7 May 2020 11:30 PM GMT
వుహాన్ ల్యాబ్ లో కరోనా సృష్టి..ట్రంప్ ఆరోపణల్లో నిజమెంత?
X
ప్రపంచాన్ని గుప్పిటి పట్టి లక్షల కేసులు.. వేల మరణాలకు కారణమైంది కరోనా వైరస్. ఇప్పటికీ దేశాలన్నీ లాక్ డౌన్ లోనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఈ కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. ఇప్పటికే లక్షల కేసులు.. వేల మరణాలు సంభవించాయి.

కరోనాను అమెరికాలో ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నెపం నెట్టేస్తున్నారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ తయారైందని.. ఇది ఖచ్చితంగా జీవాయుధం అని అధ్యక్షుడు ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపీ ఆరోపించారు. తమ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. వీరి వాదనకు కొంత మంది మద్దతు తెలిపారు.

అయితే తాజాగా ట్రంప్ ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో), వెస్టరన్ ఇంటెలిజెన్స్ వర్గాలు, ట్రంప్ అగ్ర అన్ఫెక్షియస్ డీసీజ్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ స్పందించారు. ట్రంప్ ఆరోపణలు కుట్ర సిద్ధాంతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వూహాన్ ల్యాబ్ లో కరోనా పుట్టిందనడానే ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు. ప్రకృతి పరిణామ క్రమంలో వైరస్ ఉద్భవించి ఇతర జాతుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని చెప్పారు.

ఇక బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం చైనీస్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆస్ట్రేలియా పత్రిక డైలీ టెలిగ్రాఫ్ చేసిన పరిశోధనలో వూహాన్ ల్యాబ్ లో పనిచేసిన ఒక పరిశోధకుడిని ఇంటర్వ్యూ చేసింది.అక్కడ ఎవరికి వైరస్ సోకలేదని అతడు పేర్కొన్నాడని తెలిపింది. ఆస్ట్రేలియా ప్రధాని సైతం ఇది వూహాన్ లోని వెట్ మార్కెట్ నుంచే పుట్టి ఉండొచ్చని అన్నారు.

మరోవైపు చైనా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనలు కొట్టిపారేస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో వూహాన్ లో జరిగిన వరల్డ్ మిలటరీ గేమ్స్ లో ఒక అమెరికా మిలటరీ అథ్లెట్ ఈ వైరస్ అంటించాడని అక్కడి మీడియా రాసిందని .. ఇది అమెరికా సృష్టియే అని ఆరోపిస్తోంది.