Begin typing your search above and press return to search.

గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వెతికింది వీటికోసమే?

By:  Tupaki Desk   |   26 April 2022 12:30 AM GMT
గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా వెతికింది వీటికోసమే?
X
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని మగ పుంగవులు అంతా వర్క్ ఫ్రం హోంతో ఇంట్లో బందీ అయిపోయారు. ఆడవాళ్ల రాజ్యంలో అష్టకష్టాలు పడుతున్నారు. అంతకుముందు ఉదయం, సాయంత్రం మాత్రమే భార్యలతో మాట ముచ్చట.. ఇంకేమైనా చేసేవారు.

కానీ 24 గంటలు కళ్లముందే ఉండేసరికి భార్యల టార్చర్ భర్తలపై ఎక్కువైపోతోంది. భర్తల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందట..అయితే భర్తల గోల ఇలా ఉంటే భార్యలు, మహిళలు మాత్రం ఇంటర్నెట్ లో తమ అవసరాలు తీర్చుకునేందుకు తెగ వెతికేస్తున్నారని తేలింది.

ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ లో ప్రతీసారి ఎక్కువగా వెతికే జాబితాను విడుదల చేస్తుంది... ప్రజలు గూగుల్ లో ఎలాంటి విషయాలు వెతికారనే విషయంపై న్యూజిలాండ్ లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ ఫ్లిక్ట్ స్టడీస్ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భార్యలపై ఎలా పైచేయి సాధించాలని ఎక్కువమంది మగవాళ్లు గూగుల్ లో వెతికినట్టు సర్వే గుర్తించింది.

ఇక మగాళ్ల సంగతి పక్కనపెడితే.. గూగుల్ లో అసలు అమ్మాయిలు వేటిని ఎక్కువగా వెతికారో తాజాగా బయటపడింది.ఎక్కువమంది గోరింటాకు డిజైన్లు, రోమాంటిక్ పాటలు,రోమాంటిక్ కవితలు వెతుకుతున్నారట.. అలాగే అందాన్ని మెరుగుపరిచే టిప్స్, బట్టలు,డిజైన్లు,కొత్త కలెక్షన్స్, ఏ కెరీర్ ఎంచుకోవాలి? ఏ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందనే విషయాలపై అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు గూగుల్ రిపోర్ట్ తెలిపింది.

మనదేశంలో ఇంటర్నెట్ ను వినియోగించే వారు సుమారుగా 150 మిలియన్ల దాకా ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో మహిళలు 60 మిలియన్లు ఉన్నారని పేర్కొంది. కాగా మహిళలే ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వేలో తేల్చిచెప్పింది.

వీరిలో 15 నుంచి 34 ఏళ్ల మధ్యనున్న వాళ్లే 75 శాతం మంది మహిళలు గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా తమ జీవనశైలిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే విషయంపైనే ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.