Begin typing your search above and press return to search.

బాబు ఫెయిల్యూర్ అసలు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   28 Oct 2020 12:40 PM IST
బాబు ఫెయిల్యూర్ అసలు కారణం ఇదేనా?
X
ఒప్పులు చేయాల్సిన అవసరం లేదు. తప్పులు తగ్గించుకుంటే చాలు.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి రాజకీయ వర్గాలు చేసే సూచనగా చెప్పాలి. వరుస వైఫల్యాలు వెక్కిరిస్తున్నా.. తన తీరును మార్చుకోని ఆయన తీరు పార్టీకి సమస్యగా మారిందని చెబుతారు. విపక్షంలో ఉన్న వేళ.. ప్రజా సమస్యల గురించి మాట్లాడటం మంచిదే. అలా అని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు.

అధికారపార్టీని ఇరుకున పెట్టాలంటే.. కత్తిలాంటి కాన్సెప్టును తీసుకోవాలి. లోతైన విశ్లేషణ చేయాలి. అధికార పార్టీ తప్పు ప్రజలకు ఇట్టే అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడు మాత్రమే మైలేజీకి సాధ్యమవుతుంది. అలా కాకుండా గంపగుత్తగా విమర్శలు.. ఆరోపణలు చేస్తే ఎలాంటి ప్రభావం ఉండకపోగా.. వాదన కాస్తా రొదగా మారుతుంది. ప్రజలకు చికాకును కలిగిస్తుంది. అదే సమయంలో అధికారాపక్షం మీద ఒత్తిడికి సాధ్యం కాదు.

అయితే.. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు తన ధోరణిలో తాను సాగిపోతుంటారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాబు మాట్లాడిన మాటలు.. ప్రస్తావించిన అంశాలు చూస్తే చాలు.. ఆయనలోని లోపాలు ఇట్టే కనిపిస్తాయి. ఏపీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేని రాజధాని అమరావతి ఇష్యూను ప్రస్తావించటం.. తన తప్పులతో తిప్పలు తెచ్చిన పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించి.. ప్రభుత్వంపై విమర్శలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు

అదే సమయంలో.. ఉచిత ఇళ్ల పంపిణీ.. పెండింగ్ బిల్లుల చెల్లింపు.. స్థలాల పంపినీ కార్యక్రమం.. నిత్యవసర ధరల పెంపు.. విద్యుత్ ఛార్జీల పెంపు.. పెట్రోల్.. డీజిల్ ఛార్జీల పెంపు.. లాంటి పలు అంశాల్ని ఆయన అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. గతంలో పెట్రోల్.. డీజిల్ ధరలు లీటరుకు రూపాయి పెంచితే ఆగమాగం అయ్యేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ధరల పెంపును ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు. లేకుంటే.. రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో ముఖ్య భూమిక కేంద్రానిదే. అలాంటి కేంద్రం మీద ఎవరూ ఆగ్రహం వ్యక్తం చేయటం లేదన్నది మర్చిపోకూడదు. ఇలా కాలం చెల్లిన కాన్సెప్టుల్ని పట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. అన్నింటికి మిచి.. ఏదైనా ఇష్యూ మీద సీరియస్ గా ఫోకస్ చేయటం మానేసి.. పలు సమస్యల్ని అదే పనిగా ప్రస్తావించటం వల్ల ప్రజలకే కాదు.. బాబుకు కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో? బాబు వైపల్యాలకు ఇదో ముఖ్యమైన కారణంగా అభివర్ణిస్తుంటారు.