Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆర్థిక ధీమాకు.. ఈ అంకెలే కారణమా?
By: Tupaki Desk | 31 May 2021 7:00 PM ISTకష్టాలు రావొచ్చు. వాటికే కకావికలమయ్యే పరిస్థితి కొన్ని రాష్ట్రాలకు ఉంటుంది. అందుకు భిన్నమైన సిత్రం తెలంగాణ సొంతం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. గణాంకాలు వాస్తవాల్ని ఆవిష్కరిస్తాయి. అదే సమయంలో ధీమాను పెంచుతాయి. కేసీఆర్ కున్న భరోసా.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనకు కారణంగా ఆర్థిక గణాంకాలేనని చెబుతారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాల్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉండే కేసీఆర్ కు.. రాష్ట్రంలోని బలమైన ఆర్థిక పురోగతేనని చెప్పాలి.
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పటికి.. మరీ దారుణమైన రీతిలో లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి గణాంకాలు. కరోనా కేసులు నమోదు కావటం.. లాక్ డౌన్ విధించటం లాంటి అనుకోని కష్టాలు మీద పడిన వేళలో.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం బాగా దెబ్బ తింది. అయితే.. దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నంతనే పాత పద్దతిలో జోరుగా సాగటమే కాదు.. స్వల్ప వ్యవధిలోనే రాబడి విషయంలో మార్పు రావటం గమనార్హం.
2020 ఏప్రిల్ లో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటంతో రెండు నెలలు తగ్గిన పన్ను ఆదాయం.. జూన్ లో పుంజుకోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయ పరపతికి ఎంతలా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి. చాలా రాష్ట్రాలు 2019తో పోలిస్తే.. 2020 పన్ను ఆదాయం.. రాష్ట్ర రాబడి మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. కానీ.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా 2020లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఆరు నెలల పాటు ఆదాయం పెరగటమే కాదు.. మరో రెండు నెలలు ఇంచుమించు దగ్గరగా రావటం కనిపిస్తోంది.
అంటే.. కరోనా.. లాక్ డౌన్ కారణంగా రాబడి తగ్గినప్పటికి.. ఆ వెంటనే పుంజుకోవటం తెలంగాణలో స్పష్టం కనిపిస్తోందని చెప్పాలి. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే లాక్ డౌన్ విధించినప్పటికీ.. కరోనా కేసులు ఒక కొలిక్కి వచ్చిన వెంటనే.. రాష్ట్ర పన్ను ఆదాయంతో పాటు.. రాబడి కూడా పుంజుకోటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని.. ముందున్నదంతా మంచి కాలమే అన్న ధీమాతో పాటు భరోసాను కలిగించేలా గత ఏడాది ఆదాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.
2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. రూ.79వేల కోట్లకు పైనే ఆదాయం వచ్చింది. అందులో జీఎస్టీ.. అమ్మకం పన్ను 80 శాతం వరకు రాగా.. ఎక్సైజ్ రాబడులు 90 శాతం వరకు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రం 52 శాతం వచ్చాయి. అయితే.. ధరణి పోర్టల్ లో మార్పులు.. ఆ తర్వాత మూడు నెలలకు పైనే ఇళ్ల.. వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయటం పన్ను ఆదాయం భారీగా పడిపోవటానికి కారణంగా చెప్పాలి. ఒకవేళ.. రిజిస్ట్రేషన్లు నిలిపివేయకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న మాట వినిపిస్తోంది.