Begin typing your search above and press return to search.
స్వామి భక్తి ఉంటే ఇంతగా మోకాళ్లపై కూర్చోవాలా?
By: Tupaki Desk | 27 Jan 2022 6:16 PM ISTఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఐఏఎస్ స్థాయి అధికారుల తీరు. వారికి లభించే హోదా.. అదికారం తీరు వేరేగా ఉంటాయి. ఎంత పనిరాక్షసుడు అని పేరుకున్నప్పటికీ.. చంద్రబాబు హయాంలోనూ ఐఏఎస్‌లు గౌరవంగా వ్యవహరించేవారు. వారితో ఎంత పనిచేయించుకున్నప్పటికీ.. వారి హోదాకు.. గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా.. చంద్రబాబు చూసుకునేవారు. ఎక్కడా వారిని కించపరచడం కానీ, అలా వ్యవహరించేలా.. చూడడం కానీ ఎక్కడా.. కనిపించలేదు. కేవలం రాష్ట్రం అభివృద్ధి వంటి అంశాలపై గంటల తరబడి క్లాస్ ఇచ్చిన నాయకుడిగా మాత్రమే..చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు.
ఇక, ఇప్పుడు ఏపీలో జగన్ పాలనలో ఐఏఎస్‌లకు.. ఐపీఎస్‌లకు లభిస్తున్న గౌరవంపై సర్వత్రా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డీజీపీ సహా పలు జిల్లాల ఎస్పీలు.. వివిధ నిర్ణయాలపై హైకోర్టు మెట్లు కూడా ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ప్రబుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా కోర్టు మెట్లు ఎక్కినపరిస్థితి తెలిసిందే. ఇటీవల కూడా ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మ.. సుప్రీం కోర్టు ముందు వర్చువల్‌గా హాజరు కావాల్సి వచ్చింది. ఇలా.. ఐఏఎస్, ఐపీఎస్‌లు.. అన్ని రూపాల్లోనూ.. అవమానాలు ఎదుర్కొంటున్నారు.
ఇక, తాజాగా ఈ అవమానాలకు భిన్నంగా.. మరో పెద్ద ఘటనే చోటు చేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం..అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఐఏఎస్ పరుగు పరుగునవచ్చి.. `మోకాళ్ల`పై కూర్చొని మరీ ముఖ్యమంత్రితో మాట్లాడారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ దృశ్యం కనిపించింది. సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడుతూ కనిపించారు. స్వామి భక్తి ఉంటే ఇంతగా మోకాళ్లపై కూర్చోవాలా? అని ఐఏఎస్‌లు తల పట్టుకుంటున్నారు. పోనీ..జగన్ అయినా.. అధికారులను ఇలానేనా.. చూసేది? అనే విమర్శలు వస్తున్నాయి.