Begin typing your search above and press return to search.

జగన్-కేసీయార్ మధ్య తేడా ఇదేనా ?

By:  Tupaki Desk   |   19 May 2022 10:58 AM IST
జగన్-కేసీయార్ మధ్య తేడా ఇదేనా ?
X
తెలుగురాష్ట్రాల్లో ఎంపికైన రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్ధానాలను జగన్మోహన్ రెడ్డి భర్తీచేశారు. ఇదే సమయంలో కేసీయార్ తెలంగాణాలో ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ఎంపికచేశారు.

ఎవరిని ఎంపికచేసినా నూరుశాతం అధినేతల ఇష్టమే అన్న విషయం గమనార్హం. ఏపీలో జగన్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు బీద మస్తానరావు, విజయసాయిరెడ్డికే కేటాయించారు.

అలాగే తెలంగాణాకు చెందిన లాయర్ నాగార్జునరెడ్డి, బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కేటాయించారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కృష్ణయ్య ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. హెలుమొత్తం మీద చూస్తే జగన్ ఎంపిక బాగానే ఉందని అనుకోవాలి. ఇదే సమయంలో తెలంగాణా విషయానికి వస్తే కేసీయార్ ఎంపిక విషయంలో కాస్త విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కేసీయార్ ఎంపికచేసిన మూడు రాజ్యసభ అభ్యర్ధులు కూడా పూర్తిగా పారిశ్రామికవేత్తలే.

హెటిరో ఫార్మాస్యూటికల్స్ సీఎండీ పార్ధసారధిరెడ్డి, గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణా పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్ రావులను ఎంపికచేశారు. వీళ్ళముగ్గురిలో ఇద్దరికి అసలు పార్టీతో సంబంధమే లేదు. దామోదర్ రావుకు కేసీయార్ బంధువు హోదాలో టీఆర్ఎస్ తో గట్టిసంబంధాలున్నాయి.

అంతేకానీ ఆయన పార్టీ బలోపేతానికి ప్రత్యక్షంగా చేసిన పోరాటాలు ఏమీలేవు. గాయత్రి రవి ఈమధ్యనే టీఆర్ఎస్ లో చేరినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడింది లేదు. పారిశ్రామికవేత్త హోదాలోనే ఎంపికయ్యారు. భవిష్యత్తులో పార్టీ ఆర్ధిక అవసరాలను తీరుస్తారన్న కోణంలోనే కేసీయార్ ఎంపికచేసినట్లు విమర్శలున్నాయి.

హోలు మొత్తంమీద చూస్తే కేసీయార్ చేసిన ఎంపికతో పోలిస్తే జగన్ ఎంపికే బాగుందంటున్నారు. నిరంజన్ రెడ్డి మాత్రం జగన్ వ్యక్తిగత లాయర్ కాబట్టే ఎంపీగా అవకాశం దక్కించుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కృష్ణయ్యకు కూడా వైసీపీతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయితే ఆయన బీసీ సామాజికవర్గం సమస్యలపై సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్న చరిత్రుంది. కాబట్టి కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చిన విషయంలో ఎవరు తప్పుపట్టడంలేదు.