Begin typing your search above and press return to search.
ట్రంప్ కోత్త పార్టీ పై మిల్లర్ స్పందన ఇదే ?
By: Tupaki Desk | 26 Jan 2021 3:00 PM ISTఅమెరికా అధ్యక్షపదవి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలిగిన డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని, అయిన పార్టీ పేరు పేట్రియట్ పార్టీ అని , తక్షణం కాకపోయినా సరైన సమయంలో దీన్ని ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2024లో జరగబోయే ఎన్నికల్లో పోటీలో నిల్చొవాలనే లక్ష్యంతో దాన్ని బలోపేతం చేయడానికి అందుబాటులో గల అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నట్లు మీడియా అంచనా వేసింది.
అయితే , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పార్టీ పెడతారనే వార్తలపై ఆయన ప్రచార సలహాదారు మిల్లర్ తాజాగా స్పందించారు. కోత్త పార్టీ పెట్డడంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పారు. 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో హౌజ్, సెనేట్‌లో మళ్లీ రిపబ్లికన్లను గెలిపించడంపై ట్రంప్ ప్రస్తుతం దృష్టి పెట్టారని తెలిపారు. ఇక, వైట్ హౌస్ ను వీడే ముందు రోజు ట్రంప్ ఓ వీడియో పోస్టు చేసిన ట్రంప్.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, ట్రంప్ మూడో పార్టీ స్థాపించే అవకాశాలు ఉన్నట్లు వదంతలు వ్యాపించాయి. కానీ ,ఆ వార్తలను కొట్టిపారేశారు అయిన సలహాదారు మిల్లర్. కాగా, అమెరికా అధ్యక్షుడిగా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్.. ఈ నెల 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు కూడా చేపట్టారు.